ప్రముఖ సోషల్ మీడియా వాట్సప్ వినియోగదారుల ఈ ఒక్క షేరింగ్ యాప్ నే నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే. అవును మీరు చదువుతున్నది నిజం. వాట్సప్ వాడికి నచ్చినపుడు మీ వాట్సప్ అకౌంట్ ని 24 గంటలు లేదా 48 గంటలు బ్లాక్ చేసేస్తాడు. దానికి కారణాలు అంటూ ఏమీ ఉండవు. జస్ట్ మీ వాట్సప్ ఓపెన్ చేయగానే ‘దిస్ అకౌంట్ కెన్ నో లాంగర్ యూస్ వాట్సప్’ అని వస్తుంది. తరువాత మీరు వాట్సప్ ని రిక్వెస్ట్ చేసుకోవాలి. నా వల్ల తప్పు జరిగింది. మీ టెర్స్మ్ అండ్ కండిషన్స్ కి నాకు తెలుసు. ఖచ్చితంగా పాటిస్తానని. అలా మెసేజ్ చేస్తే తప్పా మళ్లీ మీ అకౌంట్ రీ ఓపెన్ కాదు. సో ముఖ్యమైన సమయంలో మీ వాట్సప్ బ్లాక్ అయితే పరిస్థితి ఏంటి..? ఎవరికైనా సమాచారం పంపాలంటే అప్పటికప్పుడు ఏం చేస్తారు..? అవతలి వ్యక్తికి వాట్సప్ తప్ప మరే ఇతర సోషల్ మీడియా యాప్ లేకపోతే ఆ టైమ్ లో మీరు చచ్చారే. అందుకే సమాచారం పంచుకోవడానికి ఇపుడు సామాజిక మాద్యమాలలో ఒకటైన వాట్సప్ ను నమ్ముకుంటే మాత్రం నట్టేట మునిగినట్టే.
ప్రస్తుతం ఈ సమస్యను వివిధ దినపత్రికలు, యూట్యూబర్స్, ఏఐ సంబం యాప్స్ షేర్ చేసినా, థర్డ్ పార్టీ యాప్స్ రిసీవ్ చేసుకున్నా, లేదా మీరు ఇనిస్టాల్ చేసుకున్నప్పుడు అవతలి వాడు మీ వాట్సప్ నెంబరుకి లింక్ పంపినా వెంటనే మీ వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిపోయితుంది. సో మీరు జాగ్రత్తగా ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు రెగ్యులర్ గా వాట్సప్ తో పాటు, టెలీగ్రామ్ ను సేఫ్ సైడ్ గా పెట్టుకోవాల్సిందే. లేదంటే మాత్రం మీరు అడ్డంగా దొరికిపోయినట్టే. వాట్సప్ మీ అకౌంట్ ని బ్యాన్ చేసినపుడు ఎందుకు చేస్తున్నాడో చెప్పడు. కేవలం వాట్సప్ గైడ్ లైన్స్ అండ్ టెర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అతిక్రమించారని మాత్రమే చెబుతాడు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ సంస్థల్లో పనిచేసేవారు ఒక్క వాట్సప్ పైనే ఆధారపడితే మాత్రం నట్టేట మునగడం ఖాయం. బ్యాన్ చేసినవాడు మళ్లీ ఎప్పుడు తెరుస్తాడో... ఆ సమయానికి అవతలివారికి సమాచారం పంపడానికి ఆలస్యం అయితే మీ పనులన్నీ గాల్లోనే ఉంటాయి.
ప్రస్తుతం ఈ సమస్య అత్యధికంగా వాట్సప్ యూజర్లను వేధిస్తున్నది. దీనితో అందరూ ప్రధానంగా టెలీగ్రామ్ యాప్ ని వినియోగిస్తూ.. వాట్సప్ ను ఒక ప్రత్యామ్నాయ సోషల్ మీడియా, షేరింగ్ యాప్ గా మాత్రమే వినియోగించుకునే పరిస్థితి వచ్చింది. ఇకపై వాట్సప్ వినియోగదారులు ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేసేందుకు, రెగ్యులర్ గా వినియోగించు కునేందుకు వాట్సప్ మీదే నమ్మకం పెట్టుకుంటే ఏదోఒక ముఖ్యమైన సమయంలో మీరు అడ్డంగా బుక్ అయినట్టే. అందుచేత సాధ్యమైనంత వరకూ ముఖ్యమైన సమాచారాన్ని మెయిల్ లేదా, టెలీగ్రామ్ ద్వారా పంపుకునే అలవాటు చేసుకోవాలి. లేదంటే మాత్రం వాట్సప్ కొట్టే దెబ్బ ఒక్కోసారి మీరు చేసే ఉద్యోగాలపై కూడా పడొచ్చు. అంతేకాదు మీ సమాచారానికి కూడా రక్షణ ఉండదు. గతంలో ఇబ్బడి ముబ్బడిగా వాట్సప్ ను అన్నింటికీ వినియోగించేద్దామన్నా కుదరని పని. వాట్సప్ నియమనిబంధనలకు లోబడి మాత్రమే వినియోగించాలి.
లేదంటే దీనీని వినియోగించకపోవడమే బెటర్. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా సమయంలో మన సహచర వినియోగ దారులను చైతన్య పరచడానికి ఏ సమాచారాన్ని అయినా పోస్టు చేద్దామనుకున్న సమయంలో వాట్సప్ మీ అకౌంట్ ని బ్యాన్ చేస్తే పరిస్థితి ఏంటి..? మీ సమాచారం అవతలి వ్యక్తికి చేరదు సరికదా...అవతలి నుంచి మీకు సమాచారం కూడా రాదు. అందుచేత ఇప్పటి నుంచే ఇప్పుడిప్పుడే తనతో మామూలుగా ఉండదని.. వాట్సప్ వినియోగ దారులతో అడుకోవడం మొదలు పెట్టింది కనుక. వినియోగదారులతో ఆడుకునే వాట్సప్ ని వినియోగదారులు కూడా వినియోగించడం తగ్గించుకుంటే రానున్న రోజుల్లో వచ్చే కష్టాల నుంచి ముందుగా బయటప డటానికి అవకాశం వుంటుంది.
ఎలాంటి సందర్భాల్లో మీ వాట్సప్ అకౌంట్ బ్యాన్ అవుతుందో కొన్ని ఉదాహరణలు తెలుసుకుంటే..
ప్రస్తుతం ఏఐ(ఆర్టిఫిషియల్) ఇంటెలిజెన్స్ ట్రెండిరగ్ లో ఉంది. దానికి సంబంధించిన ఏ థర్డ్ పార్టీ ట్రైనింగ్ యాప్ గానీ, సంబంధిత ఏఐ యాప్ ఇనిస్టాల్ చేసినా మీ వాట్సప్ అకౌంట్ బ్యాన్ అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టినా, న్యూస్ పేపర్ క్లిప్పింగులు అధికంగా షేర్ చేసినా కూడా మీ నెంబర్ ను వాట్సప్ బ్లాక్ చేస్తుంది. సెక్యూరిటీ లేని యాప్స్, హై రిస్క్ తో కూడుకున్న యాప్స్, చైనా యాప్స్, నిషేధిక కంటెంట్ ఉన్న వీడియోలు, పేపర్ క్లిప్పింగులు, యుద్దాలు జరిగే సమయంలో తీసిన వీడియోలు, బూతులు తిడుతూ మెసేజులు పెట్టినా..ఒక సమాచారాన్ని అధికంగా షేర్ చేసినా, ఫేస్ బుక్ లోని కొన్ని శిక్షణలకు సంబంధించిన వెబ్ సైట్స్ లింక్స్ క్లిక్ చేసినా.. బ్రాడ్ కాస్ట్ గ్రూపులు క్రియేట్ చేసి దాని ద్వారా న్యూస్ క్లిప్పింగులు, యూట్యూబ్ లింకులు, మరేదైనా పోస్టు చేసినా.. పబ్లిసిటీకి వినియోగించినా.. దానికి వాట్సప్ నెంబరు లింక్ అయి ఉంటే మాత్రం మీ వాట్సప్ నెంబరు వెంటనే బ్లాక్ అయిపోతుంది.
తరువాత మీరు 24 గంటల నుంచి 48 గంటల వరకూ మీకూ సోషల్ మీడియాకి సంబంధాలు తెగిపోతాయి. అంతేకాకుండా రెండు వేర్వేరు వాట్సప్ అకౌంట్లు ఒకే మొబైల్ లో వినియోగించినా.. వాటిని వాట్సప్ వెబ్ కి కనెక్ట్ చేసినా కూడా మీ అకౌంట్ బ్లాక్ అయిపోవడం ఖాయం. ఇవన్నీ గత నెల రోజుల నుంచి ఈరోజు-ఈఎన్‌ఎస్ మీడయా సంస్థ వాట్సప్ పై రీసెర్చ్ చేసి అందిస్తున్న వాస్తవాలు. సంస్థకు చెందిన రెండు నెంబర్లను మార్చి మార్చి వాట్సప్ ఇప్పటి వరకూ బ్యాన్ చేస్తూ వచ్చింది. ఎందుకిలా బ్యాన్ చేస్తుందనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈఎన్‌ఎస్ నెట్వర్క్ రిపోర్టర్లు, డెస్క్ రిపోర్టర్లు, సిబ్బంది ఇలా అన్ని కోణాల నుంచి వివిధ అంశాలపై విచారణ ప్రారంభించాం. దానితో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
రానున్న రోజుల్లో వాట్సప్ ఫ్రీ నుంచి పెయిడ్ వరకూ వెళుతుందని.. సేమ్ టు సేమ్ రిలయన్స్ జియో ఉచితంగా సిమ్ లు.. ఇంటర్నెట్ ఇచ్చి ఆ తరువాత ఏ విధంగా రక రకాల ప్యాకేజీలతో వినియోగదారులను నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నాడో అదే తరహా బిజినెస్ ప్లాన్ ను వాట్సప్ కూడా త్వరలోనే అమలు చేయబోతుందట. సో ఇప్పటి నుంచే మీరు వాట్సప్ కి అతుక్కుపోతే రానున్న రోజుల్లో మీరు కేబుల్ టివికి రెంటు కట్టినట్టు వాట్సప్ వినియోగించినందుకు రెంట్ కట్టాల్సి రావొచ్చు. మాకున్న సమాచారాన్నే నమ్మమని వినియోగదారులకు మేము చెప్పడం లేదు..? అలాగనీ ఈ ఆప్షన్ ను ప్రజలు వ్యతిరేకిస్తే..వాట్సప్ వాడే విరమించుకుం టాడని కూడా చెప్పలేము.
కానీ రానున్న రోజుల్లో వాట్సప్ మాత్రం వినియోగదారులకు చుక్కుల చూపించడం మాత్రం ఖాయం. ఆ పని ఇప్పటి నుంచే ప్రారంభించినందున.. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది వినియోగిస్తున్నట్టుగా వాట్సప్ కంటే వెయ్యి రెట్లు మంచి ఫీచర్స్ ఉన్న టెలీగ్రామ్ సోషల్ మీడియా యాప్ కి వినియోగదారులు అలవాటుపడటం ద్వారా రానున్న ఉపద్రవాన్ని ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడటానికి ఆస్కారం వుంటుంది. సో యువర్ వాట్సప్ అకౌంట్ బ్యాన్ అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్న వాట్సప్ కోసం పూర్తిగా తెలుసుకొని షేరింగ్ యాప్ నమ్మకాన్ని తగ్గించుకొని.. వేరొక యాప్ కి షిఫ్ట్ అవడం బెటర్.. లేదంటే.. బ్యాన్ అయిన ప్రతీసారి 24 గంటల నుంచి 48 గంటు వాట్సప్ చేతిలో వినియోగదారులంతా బందీకాక తప్పదు. పారాహుషార్..?!