సెప్టెంబరు 17 వరకూ భారీ వర్ష సూచన..
Ens Balu
1
New Delhi
2020-09-14 15:16:40
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి ఉత్తరంగా అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రాబోయే 2-3 రోజుల్లో పశ్చిమ వాయ్యవ దిశగా కదులుతూ తెలం గాణ మీదుగా మధ్యభారతంవైపు పయనించే అవకాశాలున్నాయని న్యూఢిల్లీలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. అల్పపీడన ప్రభావంత సెప్టెంబరు 17 వరకూ వుంటుందని పేర్కొంది. ఇప్పటికే రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏఏ జిల్లాల్లో పరిస్థితి ఎలా వుండనుందో కూడా వాతావరణ కేంద్రం ముందస్తుగా ప్రాంతీయ వాతావరణ కేంద్రాలకు వర్తమానం పంపినట్టు కూడా దేశ రాజధాని వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్ప పీడనం ప్రభావం కారణంగా గత 24 గంటల్లో తీరప్రాంత ఆంధ్రప్రదేశ్లో విస్తృతం నుంచి అక్కడక్కడా భారీగా, అతిభారీగా వర్షాలు కురిశాయి. ఈ మేరకు ఇవాళ ఉదయం 08:30 గంటలవరకూ నమోదైన ప్రధాన వర్షపాతం (10 సెంటీమీటర్లు అంతకన్నా అధికంగా) వివరాలు: తణుకు-18; తిరువూరు-16; అమలాపురం-14; చింతలపూడి-10 సెం.మీ. మేర వర్షపాతాలు నమోదు అయ్యాయి.