ఈ ఒక్కరోజే 78% కోవిడ్ రోగులు కోలుకున్నారు...
Ens Balu
3
New Delhi
2020-09-14 19:41:03
కోవిడ్ నుంచి కోలుకుంటున్న భారత్ యాత్ర ఈ రోజు మరొక మైలురాయి దాటింది. వైరస్ కోలుకుంటున్నవారి శాతం 78.00% చేరింది. రోజువారీ కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదనటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. గడిచిన 24 గంటలలో 77,512 మంది కోవిడ్ నుంచి విముక్తి పొందారని తెలిపిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 37,80,107 కు చేరిందని పేర్కొంది. ఇలా కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో చికిత్సలో ఉన్నవారికీ, కోలుకున్న వారికీ మధ్య తేడా పెరుగుతూ వస్తోంది. ఈ రోజు అది దాదాపు 28 లక్షలకు (27,93,509) చేరింది. దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 9,86,598 కాగా, వీరిలో 60% మందికి పైగా కేవలం మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు ఈ ఐదురాష్ట్రాల్లో కోలుకుంటున్నవారిలో కూడా 60% ఈ రాష్ట్రాలకు చెందినవారే ఉండటం గమనార్హం. గడిచిన 24 గంటలలో కొత్తగా 92,071 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదుకాగా... అందులో మహారాష్ట్ర అత్యధిక కేసులతో మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 22,000 కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 9,800 కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల విషయానికొస్తే గడిచిన 24 గంటలలో 1,136 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన ఈ మరణాలలో దాదాపు 53% మూడు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. అవి: మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్. ఆ తరువాత స్థానాల్లో తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. నిన్నటి మరణాలలో 36% పైగా మహారాష్ట్ర (416 ) నుంచే కావటం గమనార్హం.