మే నెలలో బ్యాంకులకు సెలవులు ఇవే
Ens Balu
3
Tadepalli
2022-04-26 10:45:53
మే నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి. అవి ఏఏ తేదీలలో ఉన్నాయో తెలుసుకోండి. ప్రతి నెల బ్యాంకులకు సెలవులనేవి అంటాయి. అయితే ఈ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు ఉన్నాయనే విషయాన్ని రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీని ప్రకారం మే నెలలో బ్యాంకులకు 11 రోజులు సెలవులున్నాయి. ఈ సెలవులనేవి జాతీయ సెలవులు కాకుండా రాష్ట్రాల పరంగా కూడా కొన్ని సెలవులున్నాయి. అవి ఏ రోజులంటే..? మే 1 : ఆదివారం , మేడే, మే 2 : సోమవారం, మహర్షి పరుశురామ జయంతి (కొన్ని రాష్ట్రాల్లో సెలవు),
మే 3 : మంగళవారం, ఈద్ ఉల్ ఫితర్, బసవ జయంతి,( కర్ణాటక), మే 4 : బుధవారం, ఈద్ ఉల్ ఫితర్( తెలంగాణ), మే 8 : ఆదివారం, మే9 : సోమవారం, రవీంద్ర నాధ్ ఠాగూర్ జన్మదినం (పశ్చిమ బెంగాల్, కలకత్తా, త్రిపుర), మే 14 : రెండో శనివారం, మే15 : ఆదివారం, మే 16 : సోమవారం, బుద్ధ పూర్ణిమ, బ్యాంకు సెలవు, మే 24 : మంగళ వారం, ఖాజీ నజ్రుల్ ఇస్మాల్ పుట్టిన రోజు (సిక్కిం), మే 28 : నాలుగో శనివారం, అన్ని చోట్ల సెలవు, మే 29 : ఆదివారం గా ఉన్నాయి.. ఈ రోజుల ను బట్టి మీ ఆర్ధిక లావాదేవీలు చేసుకోవాల్సి వుంటుంది.