నేటి నుంచి ఎస్బీఐ ఏటిఏంకి మొబైల్ తీసుకెళ్లాల్సిందే..


Ens Balu
4
Mumbai
2020-09-18 08:17:14

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో కేష్ విత్ డ్రా చేసుకోవడానికి కొత్త నిబంధన ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్‌బీఐ ఏటీఎం లలో ఓటీపీ ఆధారిత విత్‌డ్రాయల్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యింది. తద్వారా ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవాలంటే తప్పనిసరిగా వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) ఎంట‌ర్ చేయాల్సి వుంటుంది. ఈ రోజు నుంచి అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) 10 వేలు రూపాయలు అంతకుమించి చేసే నగదు ఉపసంహరణలకు పిన్‌ నంబర్‌తోపాటు ఓటీపీ నమోదు చేయడం కోసం మొబైల్ ఫోన్ తీసుకెళ్లాల్సి వుంటుంది. డెబిట్‌ కార్డుకు లింక్‌ చేసిన ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేస్తేనే ఏటీఎంలో నుంచి నగదు వస్తుంది. ఓటీపీ లేకపోతే 10 వేల రూపాయలకు మించి న‌గ‌దు తీసుకువడానికి అవకాశం వుండదు. నిన్నటి వరకూ రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య ఎస్‌బీఐ ఏటీఎంల్లో రూ.10వేలకు మించి చేసే ఉపసంహరణలకు వినియోగదారుల మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఇవ్వడం తప్పనిసరిగా అమల్లో ఉంది. రాత్రి సమయాల్లో ఏటిఎం మోసాలకు తావివ్వకుడాదనే ఉద్దేశ్యంతో ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది ఎస్బీఐ. ఈ విధానం మంచి ఫలితాలను ఇవ్వడంతో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) ఈ నిబంధనను అమలు చేసింది ఎస్బీఐ దీంతో ఖాతాదారులకు పూర్తి రక్షణ కల్పించినట్టైంది.