24 గంటల్లో కోవిడ్ నుంచి 87,472 మంది కోలుకున్నారు..
Ens Balu
3
New Delhi
2020-09-18 16:15:51
దేశంలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 87,472 మంది ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. భారతదేశంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య గత కొద్ది రోజులుగా చాలా ఎక్కువగా ఉన్నట్టు నమోదవుతూ వస్తోంది. గత 11 రోజులలో ప్రతిరోజూ 70,000 కు ఒపైగా కరోనా బాధితులు కోలుకుంటున్నారు. దీంతో కోలుకున్నవారి శాతం ఈ రోజు 78.86% కు పెరిగింది. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 41,12,551 కు చేరిం ది. ప్రస్తుతం 30,94,797 మంది ఇంకా చికిత్సలో ఉండగా వారికి 4.04 రెట్లమంది కోలుకొని బైటపడ్దారు. చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు అత్యధికంగా ఉన్న మొదటి ఐదురాష్టాల్లోనే కోలుకుంటున్నవారు కూడా అత్యధికంగా ఉన్నారు. చికిత్స పొందుతూ ఉన్న బాధితులలో 59.8% మంది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే నమోదయ్యారు. ఇవే ఐదు రాష్ట్రాలలో కోలుకున్నవారిశాతం కూడా అధికంగా 59.3% గా నమోదు కావటం గమనార్హం. కొత్తగా కోలుకుంటున్నట్టు నమోదవుతున్న వారిలో 90% మంది 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు.
ఇప్పుడు తాజాగా కోలుకున్నవారిలో మహారాష్ట్ర (19,522) మొత్తం కొత్త కేసుల్లో 22.31% కాగా ఆంధ్రప్రదేశ్ (12.24%), కర్నాటక (8.3%), తమిళనాడు (6.31%) చత్తీస్ గఢ్ (6.0%) కలిపి 32.8% కొత్తగా కోలుకున్న కేసులు నమోదు చేశాయి. ఇవన్నీ కలిపి చూస్తే 55.1% మంది కొత్తగా కోలుకున్నవారు ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నారు.