కరోనాలోనూ 5829 టన్నులు రవాణా చేశారు..
Ens Balu
3
Visakhapatnam
2020-09-19 14:46:40
కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి అధికంగా సమయంలోనూ దేశంలోని ప్రతీ ప్రాంతానికి అవసరమైన వస్తువులు వాల్తేరు రైల్వే డివిజన్ నిరంతరాయంగా సరఫరా చేసిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ ఏకె.త్రిపాఠి వెల్లడించారు. విశాఖలో శనివారం రైల్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, టైమ్ టేబుల్ పార్సిల్ రైళ్ల ద్వారా 502 ట్రిప్పుల్లో 5829 టన్నుల సరుకులను రవాణా చేసిందన్నారు. అంతేకాకుండా దేశంలో చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలను ప్రోత్సహిం చడానికి, రైల్వేని పరిశ్రమల వాణిజ్యానికి దగ్గరగా తీసుకురావడం కోసం వాల్తేరు డివిజన్ బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ (బిడియు) ను ఏర్పాటు చేసిందని వివరించారు. దీని ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు సేవలు విస్తరించినట్టు ఆయన వివరించారు. లోడింగ్, అన్ లోడింగ్ అంశాల్లో కూడా మంచి వాతావరణాన్ని కల్పించినట్టు ఆయన వివరించారు. బిడియు ద్వారా రక్షణతో కూడిన వేగవంతమైన కార్గో రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని, దీనిని వ్యాపార, వాణిజ్య సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని త్రిపాఠి కోరారు.