రాజ్యసభలో వ్యవసాయ బిల్లుకు మద్దతు..
Ens Balu
4
Rajya Sabha
2020-09-20 11:58:16
రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన మద్దతును ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఈ బిల్లులతో రైతులకు స్వేచ్ఛ లభించడంతోపాటు దళారీ వ్యవస్థ నిర్మూళన జరుగుతుందని అన్నారు. ఆదివారం రాజ్యసభలో జరిగిన వ్యవసాయ బిల్లులపై చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, పంటలకు ముందుగానే ధర నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందన్న ఆయన మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుందన్నారు. బిల్లులో పొగాకును ఎందుకు చేర్చడం ప్రశ్నించిన ఆయన రైతు ప్రయోజనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రైతు భరోసా పేరుతో ఏపి ప్రభుత్వం 49 లక్షల మంది రైతులకు ఏటా రూ.13,500 ఇస్తోందని వివరించారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని, పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించిందని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలతో విత్తనాలు, ఎరువులు తదితర అన్ని అంశాల్లో సహాయకారిగా ఉంటూ రైతులను అభివ్రుద్ధి పధంలో ముందుకు తీసుకెళుతుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.