కరోనా విళయతాండవం...54 లక్షలు దాటిన కేసులు..
Ens Balu
1
New Delhi
2020-09-20 12:36:57
భారత్లో కరోనా ఉద్రుతి భయంకరంగా కొనసాగుతూ తన ఆదిపత్యాన్ని నిరూపించుకుంటోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 92,605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం బాధితులసంఖ్య 54,00,620 చేరింది. ఇదే సమయంలో కరోనా వైరస్ నుంచి రికవరీ రేటు సైతం భారీగానే నమోదవుతుంది. గడిచిన 24 గంటల్లో 1,133 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 86,752కు చేరుకుంది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 43,03,044కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య10,10,824గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 12 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. ఇప్పటిదాకా 6.37 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 19.10శాతం ఉండగా.. కరోనా రికవరీ రేటు 79.28గా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసుల్లో మరణాల రేటు 1.61 శాతంగా నమోదవుతుంది. అయితే మరణాల రేటుని తగ్గించడానికి అన్ని వైద్య పద్దతులను పాటిస్తున్నారు వైద్యులు.