ఆహారం తింటూ..ఫిజయో థెరపీ చేస్తూ...


Ens Balu
2
mgm hospital
2020-09-20 13:25:59

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతోందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నాన్న ఆరోగ్యం నిలకడగానే వుంది..శుక్రవారం నుంచే ఆహారం కూడా తీసుకుంటున్నారు. ఇంకా వెంటిలేటర్‌ మీదనే ఉండి చికిత్స తీసకుంటున్నారని చెప్పారు. ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థ, శక్తి మరింత మెరుగుపడాల్సి ఉంది. మిగలిన వ్యవస్థలన్నీ సాధారణంగా ఉన్నాయన్నారు. ఎటువంటి ఇన్‌ఫెక్షన్ లేదు. రోజూ 10 నుంచి 15 నిమిషాలు ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారని వివరించారు. ఆస్పత్రి సిబ్బంది సహాయంతో రోజూ 15-20 నిమిషాలు లేచి కూర్చుంటున్నారు. . ఈ సందర్భంగా నా తండ్రికి, కుటుంబ సభ్యులకు ఎంతో సహకరించిన ఎంజీఎం హెల్త్‌కేర్‌లోని వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అంటూ ఇస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.  ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్‌ వచ్చిన దగ్గర చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. అభిమానుల కోసం చరణ్ ప్రతీ వారానికి ఒకసారి తన తండ్రి బాగోగులను వీడియో ద్వారా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.