రైల్వేలో 9.79లక్షల పని దినాలు కల్పన
Ens Balu
2
New Delhi
2020-09-20 19:56:04
కేంద్రం ప్రవేశఫెట్టిన గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ పథకం కింద 2020వ సంవత్సరం సెప్టెంబరు 18కల్లా 6 రాష్ట్రాల్లో 9,79,000కిపైగా పనిదినాలు కల్పించినట్టు భారతీయ రైల్వే పేర్కొంది. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పథకం అమలు జరుగుతోందన్న రైల్వే ఈ పథకం కింద చేపట్చిన పనుల ప్రగతిని, ఆయా రాష్ట్రాల వలసకూలీల కోసం ఉపాధి పనుల కల్పన తీరును రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ నిశితంగా పర్యవేక్షిస్తూ వస్తున్నారని తెలియజేసింది. రైల్వే మౌలిక సదుపాయాలకు సంబంధించిన దాదాపు 164 ప్రాజెక్టులను ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఈ పథకం అమలుకోసం 2020వ సెప్టెంబరు 18కల్లా 12,276 మంది కార్మికులను వినియోగించారు. కాంట్రాక్టర్లకు చెల్లింపుకోసం 2,056.97కోట్ల రూపాయలు విడుదలైంది. ఈ పథకం అమలులో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో పూర్తి స్థాయి సమన్వయం కోసం ప్రతి జిల్లాకు, రాష్ట్రానికి నోడల్ అధికారులను కూడా నియమించారు.