24 గంటల్లో 94వేల మంది కోలుకున్నారు..
Ens Balu
3
New Delhi
2020-09-20 19:58:33
దేశంలో వరుసగా రెండో రోజు కూడా 94,000 మందికి పైగా గరిష్ఠస్థాయిలో కోవిడ్-19 నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత 24 గంటలలో దేశఃలో 94,612 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 43 లక్షలు (43,03,043) దాటింది. ఫలితంగా రికవరీ రేటు 79.68 శాతానికి చేరింది. కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న కేసులలో 60 శాతం మంది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్,తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారు. మహారాష్ట్రలో కొత్తగా 23,000 మందికి పైగా కొత్త కేసులు కోలుకున్నాయి. ఒక్కరోజు 10,000 మందికి పైగా కోలుకున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్,కర్ణాటక లు ఉన్నాయి. గత 24 గంటలలో మొత్తం 92,605 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 52 శాతం కొత్త కేసులు ఐదు రాష్ట్రాల నుంచి ఉన్నాయి. ఇవే రాష్ట్రాలు గరిష్ట స్థాయిలో కొత్తగా కొలుకున్న కేసులు కూడా కలిగి ఉన్నాయి. 20 వేలకు పైగా కొత్త కేసులు మహారాష్ట్రలో (22.16 శాతం) నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్,కర్ణాటక రెండూ 8,000కు పైగా కేసులు నమోదుచేశాయి. కాగా గత 24 గంటలలో 1,133 మరణాలు నమోదయ్యాయి.