హౌరా-జగదల్ పూర్ మద్య పార్శల్ ఎక్స్ ప్రెస్..
Ens Balu
2
వాల్తేరు రైల్ భవన్
2020-09-21 13:57:15
నిత్యావసర వస్తువులను నిరంతరంగా సరఫరా చేయడానకి రైల్వే సోమవారం నుంచి హౌరా- జగదల్పూర్ మధ్య టైమ్ టేబుల్డ్ పార్సెల్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించినట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ ఎకె.త్రిపాఠి చెప్పారు. సోమవారం ఆయన రైల్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ రైలు హౌరా-జగదల్పూర్ (రైలు నంబర్ 00805) నేని నుంచి 21.20 గంటలకు సోమవారం, గురువారాలు హౌరా నుండి బయలుదేరుతుందని చెప్పారు. అటు జగదల్పూర్-హౌరా (రైలు నం. 00806) బుధవారం, శనివారం 06.00 గంటలకు జగదల్పూర్ నుంచి బయలుదేరుతుందని చెప్పారు. ఈ రైళ్లు మేచెడా, పన్స్కురా, ఖరగ్పూర్, టాటానగర్, చక్రధర్పూర్, రూర్కెలా, జార్సుగూడ, సంబల్పూర్, బార్గర్ రోడ్, బాలంగీర్, టిట్లఘర్, కేసింగా, రాయగడ, హౌరా మరియు జగదల్పూర్ మధ్య కొరాపుట్ వద్ద ఆగుతుందన్నారు. అంతేకాకుండా ఐదు పార్శిల్ వ్యాన్లు తోపాటు రెండు లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్లు ఈ రైలులో వుంటాయని చెప్పారు. పైగా ఈ సర్వీసులకు సంబంధించి ఎలాంటి సహాయానికైనా కవితా నేగి, జగదల్పూర్ -6396664727,కె నాగ్- కోరాపుట్- 8763091271,జె బి కిరో-రాయగడ -7979922507 నెంబర్లలో సంప్రదించవచ్చునని చెప్పారు. సరుకు రావాణా చేయాలనుకున్న వ్యాపారస్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిసిఎం తిప్రాఠి కోరారు.