గగణతలంలో మహిళా శౌర్యం చూపిస్తాం..
Ens Balu
2
Mumbai
2020-09-21 15:28:47
ఆడది ఆకాశంలో సగం..అవును ఈ ఇద్దరు మహిళా పైలట్లను చూస్తే నిజమనే జాతిగర్వం ఆకాశమంత పెద్దదిగా అనిపిస్తుంది. భారత నౌకాదళంలో చారిత్రలోనే తొలిసారిగా అత్యాధుని ఎంహెచ్ 60 హెలీకాఫ్టర్లులో పనిచేయానికి భారత నావికాదళం వీరిని నియమించింది. యుద్ధనౌకల్లో తొలి మహిళా అధికారులుగా సబ్ లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితిసింగ్లు త్వరలోనే అడుగు పెట్టనున్నారు. భారత నావికాదళంలో ఎందరో మహిళా ర్యాంకర్ అధికారిణులున్నప్పటికీ, అన్ని పరీక్షలు నెగ్గి, పురుషులకు తామేమీ తక్కువ కాదంటూ గగణ తల వీరత్వానికి సిద్దమయ్యారు. ఎంహెచ్-60ఆర్ హెలికాఫ్టర్లు శత్రు దేశాల నౌకలు, సబ్మెరైన్లను గుర్తిస్తాయి. అలాంటి విహంగాలు తాము చెప్పినట్టు నడుస్తాయని ఎంతో ఠీవీగా చెబుతున్నారు ఈ భారతీయ మహిళా మణులు. గతంలోనే ఇండియన్ నేవీలోని అన్ని విభాగాల్లో మహిళలను కూడా దించాలనే కేంద్రం ఆలోచన పెద్దగా ఫలించలేదు. దానికి కారణం పురుషులకే తక్కువగా ఉండే బాత్ రూమ్ లు, మహిళలకు సంబంధించిన కొన్ని అంశాల్లో ఎలా నెట్టుకొస్తారని కేంద్రం వెనక్కి తగ్గింది. అయితే ఇపుడు యుద్ధ నౌకల్లో మహిళలు కూడా రాణించగలరని సబ్ లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితిసింగ్లు రుజువు చేశారు. అంతేకాదు రఫేల్ యుద్ద విమానంలో కూడా ఒక మహిళా పైలట్ ను నియమించాలనే కేంద్రం ఆలోచన చేస్తున్న వేళ వీరి గ్రాండ్ ఎంట్రీ దానికి బలాన్ని చేకూర్చింది. యుద్ధనౌకల్లో వీరి ఎంపికతో మరెందరో మహిళలు ఇండియన్ నేవీలోకి అడుగిడతారనడానికి వీరే ప్రధాన సంకేతంగా నిలుస్తున్నారు.