భారతీయ రైల్వే ప్రయాణీకుల పై వీర బాదుడు బాదటానికి సిద్ధమైపోయింది. ఇకపై ప్రయాణించే రైల్వే టిక్కెట్టు రద్దు చేసుకుంటే రైల్వేరద్దు ఛార్జీలతోపాటు దానిపై జిఎస్టీ కూడా వసూలు చేయనుంది. ఈ మేరకు భారతీయ రైల్వే ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు అదేరోజు నుంచి అమల్లోకి వస్తాయని కూడా పేర్కొంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ వ్యవహారం మరింత ఖరీదుగా మారి ప్రయాణీకులకు భారంగా పరిణమించనుంది. ఎందుకంటే రద్దు చేసుకున్నందుకు చెల్లించే రుసుముపై ఇకపై అదనంగా ‘వస్తు సేవల పన్ను (GST)’ కూడా కట్టాల్సి రావడంతో ప్రయాణీకులు ఖచ్చితంగా ప్రయాణం చేసుకోవాల్సి వుంటుంది. అత్యవసర సమయంలో రద్దు చేసుకుంటే ఆ మొత్తం తిరిగి పొందే పరిస్థితి లేకుండా పోయినట్టు అయ్యింది. అంతే కాకుండా రైలు టికెట్లతో పాటు హోటల్ బుకింగ్‌లను రద్దు చేసుకున్నా బుకింగ్ చేసిన దానిపై జీఎస్‌టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్‌ను రద్దు చేసుకుంటే మాత్రం ఎలాంటి జీఎస్‌టీ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.