ens liveలో ఇకపై పోటీపరీక్షల మెటీరియల్


Ens Balu
11
New Delhi
2022-09-02 03:09:31

భారతదేశపు తొలితెలుగు డిజిటల్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు న్యూస్ సర్వీస్ (ఈఎన్ఎస్).. ఇది తెలుగు ప్రజల గుండె చప్పుడు..!  అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live అరచేతిలో విశ్వవార్తల సమాహారం.. మరియు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ఇకపై ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్ధుల కోసం స్టడీ మెటీరియల్, డైలీ కరెంట్ అఫైర్స్, ఎస్సే రైటింగ్స్ కి సంబంధించిన మెటీరియల్, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ ప్రభుత్వ పథకాలు, అధికారిక కార్యక్రమాలన్నీ ప్రతీరోజూ అందించాలని సంకల్పించాం. దాని కోసం సబ్జెక్టుల వారీగా మెటీరియల్ ను నిరుద్యోగ యువత కోసం ఉచితంగానే మీ ముందుకి తీసుకువస్తున్నాం. ఈ సదుపాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి Google Play Store నుంచి ens live యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవడమే. అలా యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఎప్పుడైనా..ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా మేము అందించే ఉచిత పోటీపరీక్షల మెటీరియల్ ను తెలుసుకోవడానికి, చూసి నోట్సు రాసుకోవడానికి ఎంతో భాగా ఉపయోగపడుతుంది.

సివిల్ సర్వీస్(యూపీఎస్సీ), గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన సమస్త సమాచారంతోపాటు, పరీక్షల సరళి, మార్పులు, చేర్పులు, సిలబస్, గతంలో ఏ విధంగా పేవర్లు వచ్చాయి..ఈ సారి ఏవిధంగా పేపర్లు రాబోతున్నాయి.. తదితర అంశాలను కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసురాబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని యువత అత్యధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ ఉచిత స్టడీమెటీరియల్ సదుపాయాన్ని పేద, మధ్య తరగతి నిరుద్యోగ యువత కోసం తీసుకువస్తున్నాం. మీరు మీ మొబైల్ లో ఎన్నో రకాల యాప్స్ వినియోగించే కంటే మీకు పనిచేసే మంచి యాప్స్ ని మొబైల్స్ లలో ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా మీ బంగారు భవిష్యత్తుకు మీరే బాటలు వేసుకోవడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా తాజా వార్తలు, జాబ్ నోటిఫికేషన్లును కూడా తెలుసుకోవడానికి వీలుపడుతుంది. నిరుద్యోగ అభ్యర్ధుల కోసం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అందిస్తున్న ఈ ఉచిత స్టడీ మెటీరియల్ సదుపాయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం..ఆల్ ది బెస్ట్..!