రేపు 7 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు..


Ens Balu
2
New Delhi
2020-09-22 14:43:14

కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల లో చేప‌డుతున్న చ‌ర్య‌లు, ఆ వ్యాధి సంక్ర‌మ‌ణ ను అరిక‌ట్ట‌డానికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్య‌మంత్రులతో, ఆరోగ్య శాఖ మంత్రుల రేపు జరిగే జరిగే  ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్సులో  ప్ర‌ధాన మంత్రి  న‌రేంద్ర మోదీ మాట్లాడనున్నారని పీఎంఓ తెలియజేసింది. ఈ రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల లో మ‌హారాష్ట్ర, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, త‌మిళ నాడు, పంజాబ్ లతో పాటు దిల్లీ కూడా ఉంది. దేశ‌వ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల లో 63 శాతానికి పైగా కేసులు ఈ 7 రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతం లోనే కేంద్రీకృతమవుతున్నాయి. అంతేకాదు, నిర్ధార‌ణ అయిన మొత్తం కేసుల లో 65.5 శాతం కేసులు, మొత్తం మ‌ర‌ణాల లో 77 శాతం మ‌ర‌ణాలు కూడా ఈ 7 రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల్లోనే ఉండటం విశేషం.  ఇత‌ర 5 రాష్ట్రాల‌ తో పాటు, పంజాబ్‌, దిల్లీ లలో బ‌య‌ట‌ప‌డుతున్న కేసులు ఇటీవలి కాలంలో  పెరుగుతున్నాయి.  మ‌హారాష్ట్ర, పంజాబ్‌, దిల్లీ ల‌లో కేస్ ఫాట‌లిటీ రేట్ (సిఎఫ్ఆర్) 2.0 శాతం గా కంటే ఎక్కువ‌గా ఉంది.  పంజాబ్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లు మిన‌హా, వాటి పాజిటివిటీ రేటు జాతీయ స‌గ‌టు అయిన 8.52 శాతం క‌న్నా మించిపోయింది. ఈ విషయాలపై మోదీ ముఖ్యమంత్రులతో మాట్లాడి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడతారని పిఎంఓ పేర్కొంది...