24 గంటల్లో లక్షకు పైనే కోవిడ్ నుంచి కోలుకున్నారు..


Ens Balu
2
New Delhi
2020-09-22 14:59:42

భారత్ లో ఒకే రోజు కనీవినీ ఎరుగని రీతిలో  కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది. గడిచిన 24 గంటల్లో లక్షమందికి పైగా (1,01,468) కోవిడ్ నుంచి కొత్తగా కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. వరుసగా 4 రోజులుగా కొనసాగుతున్న ధోరణికి అనుగుణంగానే ఈ విధమైన పెరుగుదల నమోదు చేసుకోవటం చరిత్రాత్మకమైనదిగా భావిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 45 లక్షలు (44,97,867) చేరింది. ఈ ఎదుగుదల కారనంగా కోలుకున్నవారి శాతం 80.86కు చేరినట్టయింది. కొత్తగా కోలుకున్న కేసులలో దదాపు 70% పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదయ్యాయి. అవి మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్.   వీటిలో మహారాష్ట్ర అన్నిటికంటే ఎక్కువగా 32,000 కేసులు ( 31.5%) కోలుకున్నట్టు నమోదు చేయగా ఆంధ్రప్రదేశ్ లో ఒకే రోజు కోలుకున్నవారి సంఖ్య 10,000 మందికి పైగా ఉంది. ఈ విధంగా భారతదేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతు ఉండటంతో ప్రపంచస్థాయిలో కూడా ఎక్కువమంది కోలుకున్న దేశంగా నిలిచింది. ఈ విధంగా పెద్ద సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు కోలుకోవటానికి ప్రధాన కారణం కేంద్రం అనుసరిస్తున్న వైద్య విధానాలే కారమని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది...