అంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటి ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్న ప్రయాణికులకోసం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తిరిగి ప్రకటించాలని కమిటి చైర్మన్ బద్వేల్ షెక్ గౌసల్ ఆజామ్ కేంద్ర వ్యవహారాల శాఖా మంత్రి స్మృతి ఇరానీని కోరారు. సోమవారం ఢిల్లీలో జరిగిన మైనారిటి వ్యవహారాల మంత్రిత్వ శాఖా సమవేశంలో అన్నీ రాష్ట్రాల హజ్ కమిటీల చైర్మన్లు , అదికారులు పాల్గొన్నారు. రెండు గంటలపాటు ఈ సమవేశం లో వివిద అంశాలపై విసృత చర్చజరిగింది. ఆంద్రప్రదేశ్ నుంచి హజ్ కమిటి చైర్మన్ గౌసల్ ఆజామ్, హజ్ కమిటి సభ్యులు ఇంజనీర్ ఇషాక్ బాషా, రాష్ట్ర హజ్ కమిటి ప్రత్యెక అధికారి అబ్దుల్ ఖాదీర్ పాల్గోన్నారు. ఈ సందర్బంగా హజ్ కమిటి చైర్మన్ గౌసల్ ఆజామ్ మాట్లడుతూ విజయువాడ నుంచి అనేక అంతర్జాతీయ విమానాలు రాకపోకలు తిరిగి ప్రారంభించాయని, రానున్న హజ్ 2023 కు అంధ్రప్రదేశ్ లోని ప్రయాణికులను విజయవాడ అంతర్జాతీయ విమనశ్రయం నుంచి వెళ్ళి వచ్చేందుకు పాయింటును ప్రకటించాలన్నారు. అంధ్రప్రదేశ్ హజ్ యాత్రీకులు పవిత్ర మక్కా ,మదీనా నగరాల్లో బస చెయ్యడానికి ఇప్పటివరకు ఇస్తున్న యాత్రికుల వసతి గృహల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు . పవిత్ర యాత్రకు వెళ్తున్న హాజిలు ఎమైనా ఇబ్బందులు ఎదురైనా సహనంతో భరిస్తూ వెళ్తున్న అంశాల తమ దృష్టికి వచ్చాయన్నారు. ఈ ఇబ్బందిని అధికమించేందుకు హజ్ యాత్రకు ఒక నెల ముందు హజ్ కమిటి నుంచి ఒక అధికారిక బృందం ఆయా నగరాలకు ముందువెళ్ళి వసతిగృహాలను ముందుగానే చూసుకునే అనుమతిని సౌదీ ప్రభుత్వంతో ఇప్పించాలని కోరారు. హజ్ యాత్రికులకు యాత్ర సమయంలొ ఉచిత సేవలు అందించేందుకు ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు మత్రమే అధికారిక అనుమతి ఉందని, ఇక నుంచి హజ్ కమిటిలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను కుడా అనుమతించాలని కేంద్ర మంత్రి ఇరానీని కోరారు. ఈమేరకు కేంద్ర మంత్రి అంధ్రప్రదేశ్ అభ్యర్ధనలు పట్ల సానుకూలం స్పందించారని గౌసల్ ఆజామ్ వెళ్లడించారు.