6నెలల్లో 13244 అత్యాచార ఫిర్యాదులు..


Ens Balu
2
New Delhi
2020-09-22 20:54:51

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదించిన ప్రకారం, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సిఆర్‌పి) లో 01.03.2020 నుంచి 18.09.2020 వరకు చిన్నపిల్లలపై నమోదైన మొత్తం అశ్లీలత / అత్యాచారం మరియు సామూహిక అత్యాచార ఫిర్యాదులు 13244 అందుకుంది.  నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సిపిసిఆర్) నివేదించిన ప్రకారం, ఎన్‌సిపిసిఆర్ 2020 మార్చి 1 నుండి 2020 ఆగస్టు 31 వరకు ఆన్‌లైన్ పోర్టల్స్, హెల్ప్‌లైన్స్ మరియు ఇతర మీడియా ద్వారా 420 పిల్లల లైంగిక వేధింపుల సమాచారాన్నినమోదు చేసింది. చైల్డ్‌లైన్ ఇండియా ఫౌండేషన్ (సిఐఎఫ్) నివేదించిన ప్రకారం, 2020 మార్చి 1 నుండి 2020 సెప్టెంబర్ 15 వరకు పిల్లల లైంగిక కేసులకు సంబంధించి 3941 కాల్స్ సిఐఎఫ్‌కు వచ్చాయి ఈ సమాచారాన్ని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. పోక్సో చట్టం అమలును పర్యవేక్షించాల్సిన చిన్నారుల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్), పిల్లల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర కమిషన్ (ఎస్‌సిపిసిఆర్‌లు) సమాచారం, విద్య మరియు కమ్యూనికేషన్‌ను అభివృద్ధి చేసి, www.ncpcr.gov.in లో అందుబాటులో ఉంచాయని పేర్కొన్నారు.