ఢిల్లీలో పదేళ్ల క్రితం అన్నాహజారే ప్రారంభించిన జన్‌లోక్‌పాల్ ఉద్యమం ద్వారా ప్రాచుర్యం పొందిన కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. ఇప్పుడు జాతీయ పార్టీ హోదాను దక్కించుకుంది. దేశరాజధాని న్యూఢిల్లీలో పుట్టిన ఈ రాజకీయ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ వివిధ రాష్ట్రాలల్లో ప్రభుత్వాలు నిర్మించేంతగా విస్తరించింది. న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండు దఫాలు ఘన విజయం సాధించింది. అంతేకాకుండా ఇటీవలే జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించింది. తాజాగా జరిగిన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లోనూ గెలిచి జాతీయస్థాయిలో భాజపాకు ప్రత్యామ్నాయంగా నిలిబడింది.
కాగా కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయాలని భావించినా..ఆశలు ఫలించలేదు.ఏదైనా పార్టీకి జాతీయహోదా రావాలంటే.. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6% చొప్పున ఓట్లు పొంది ఉండాలి లేదంటే.. ఏవైనా 4 రాష్ట్రాల నుంచి 11 లోక్‌సభ సీట్లు సాధించి ఉండాలి. అయితే ఆప్ ప్రస్తుతం న్యూఢిల్లీ పంజాబ్‌లో అధికారం దక్కించుగోగా.. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో 6% ఓట్లను దక్కించుకుంది. ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచి 12% ఓట్లు సాధించి తన బలాన్ని నిరూపించుకుంది. దీంతో జాతీయపార్టీగా అవతరించేందుకు ఆప్ అర్హత సాధించినట్లయింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయపార్టీ హోదా దక్కిందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడించారు. తమ పార్టీకి ఓట్లువేసి గొప్ప అవకాశాన్ని కల్పించడంలో సహకరించిన గుజరాత్ ప్రజలు, ఆప్ కార్యకర్తలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. దేశంలో కొన్ని పార్టీలకే
జాతీయపార్టీ హోదా లభిస్తుందని.. పదేళ్ల క్రితం చిన్నపార్టీగా ఉన్న ఆప్ ఇప్పుడు జాతీయపార్టీ అయ్యిందని హర్షం వ్యక్తంచేశారు. అయితే ఇపుడు జాతీయ పార్టీల సరసన ఆప్ నిలవడం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. అంతేకాకుండా రానున్న 2024 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆప్ తరపున అభ్యర్ధులు పోటీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆప్ పార్టీ తరపున కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పార్టీకి జాతీయ హోదా రావడంతో కార్యక్రమాలు విస్త్రుతి పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.