ఆన్ లైన్ లో లడ్డూలు బుక్ చేసుకోవచ్చని అవాస్తవ ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. టిటిడి వెబ్ సైట్ ద్వారా లడ్డూలు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొంది. ఈ మేరకు సోమవారం మీడియాకి ప్రకటన విడుదల చేసింది. టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులు దర్శన టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే పరిమితంగా అదనపు లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకానీ దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలు టిటిడి వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని, ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.