ఎలక్షన్ కి ముందే ఎల్లో బ్యాచ్ దంపుడు మొదలెట్టింది


Ens Balu
136
New Delhi
2022-12-14 05:20:59

ఆంధ్రప్రదేశ్ లో వింత పరిస్థితి చోటుచేసుకుంటోంది..ఇంకా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడనేలేదు కానీ ప్రభుత్వ తీరుపై ఎల్లోబ్యాచ్ అండ్ అకో దంపుడు మొదలెట్టింది. రోజుకో విషయాన్ని వండి వార్చేస్తున్నది తమ తమ మీడియాలో. దీనితో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆ వార్తలపై ఖండనలు ఇచ్చుకోవడాని కే సమయం అంతా అయిపోతున్నది. వారి శాఖల అభివ‌ృద్ధి మాట ఎటోగానీ..ప్రభుత్వ వ్యతిరేక మీడియాలో ఒక్క న్యూస్ పబ్లిష్ అయితే మాత్రం చిర్రెత్తుకొస్తున్న నాయకులు ఎదురుదాడి మొదలెడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో మీడియాని అణగదొక్కాలని ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం మీడియాలో మొదలు పెడితే కేసులు పెట్టేది. దానితో అప్పట్లో అంతా కాస్త వెనక్కి తగ్గారు. ఇపుడు ఎలక్షన్ కి ముందు మీడియా తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. ప్రభుత్వంలో జరిగే అన్ని విషయాలను పతాక శీర్షికన ఎండగట్టే పనిచేస్తున్నది. దానితో అధికారపార్టీ సొంత టీవీ ఛానల్, సొంత పత్రికలో ఖండనలు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. వాస్తవానికి ఏదైనా ఒక వార్త తప్పు అనుకుంటే సదరు ప్రచురించిన మీడియాకి ఖండన పంపాలి. ఆ మీడియాలోనే ఖండన ప్రచురింపజేసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆపరిస్థితి లేదు. ఆ ఖండన వార్తను కూడా సొంత మీడియాలోనే వేసుకునే పరిస్థితి వచ్చింది. వ్యతిరేకంగా వార్తలు  రాసినా ప్రభుత్వంగానీ, పార్టీ ఇచ్చిన ఖండనలు ఏ ఒక్క మీడియా వాటిని ప్రచురించకపోవడం ఇపుడు చర్చనీయాంశం అవుతున్నది.

ఎల్లోమీడియానే కాదు మొత్తం మీడియానే వన్ సైడ్..
ప్రభుత్వం ఎల్లో మీడియా అని గళమెత్తుతున్న ఏపీలో మొత్తం మీడియా మొత్తం వన్ సైడ్ అవుతున్నట్టుగానే కనిపిస్తున్నది. అదేంటో జరిగిన తప్పులను ఒక్కోసారి రాసే మీడియాపై కూడా ప్రభుత్వం తిరగబడిపోతుందని.. పత్రికా స్వేచ్చను హరించేస్తున్నారని సోకాల్డ్ జర్నలిస్టు సంఘాలు, వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు కూడా మమ అనే ఆందోళనలు చేస్తున్నారు తప్పితే మరో రకంగం ముందుకు వెళ్లడం లేదు. దేని పని దానిదే అన్నట్టుగా ఆది నుంచి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వున్న ఒక వర్గం మీడియా మాత్రం ఈ మధ్య కాలంలో మాత్రం దూకుడు పెంచింది. దీనితో పరిపాలన కాకుండా పత్రికలు, మీడియాపై పడుతోంది ప్రభుత్వం. అదే సమయంలో కొన్ని పత్రికలు, ఛానళ్లు కావాలనే ప్రభుత్వం అసత్య ప్రచారాలను చేయడాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి  మధ్య వారధిగా వున్న మీడియాను అనగదొక్కే ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి ఇపుడు సమయం రావడంతో మీడియా యావత్తు అవకాశం ఎదురు చూస్తూ ప్రభుత్వ  పరిపాలనలో జరుగుతున్న తప్పులను వార్తల రూపంలో దంచి కొడుతున్నాయి. దీనితో ప్రభుత్వంపై ముప్పేట మీడియా దాడి జరుగుతున్నది. ప్రభుత్వంలోని ముఖ్య మంత్రి దగ్గర నుంచి ఇతర మంత్రులు సోకాల్డ్ మీడియాపై పదే పదే ప్రచారం చేస్తున్నప్పటికీ, మిగిలిన మీడియా కూడా వన్ సైడ్ అయిపోయారు.

ప్రభుత్వ వ్యతిరేక వర్గానికి దగ్గరవుతున్న మీడియా
మాకు  మీడియా అవసరం లేదు.. సోషల్ మీడియా ఉంటే చాలు అనుకుంటున్న ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యతిరేక వర్గానికి అసలైన మీడియా దగ్గరవుతూ లోపాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకరు వ్యతిరేక దంపుడు మొదలెడితే ఆ కోవలో నడిచే వారంతా అదే రకమైన దంపుడు మొదలెడతారనే నానుడి ప్రస్తుతం నిజమవుతున్నది. ప్రస్తుతం ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా ఉన్న ఉపాధ్యాయ వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వామపక్షాలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి మీడియా దగ్గరవుతున్నది. వారికి జరిగిన అన్యాయం, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే కార్యాచరణ చేసుకుంటూ ప్రత్యేక కధనాలను వండి వార్చేస్తున్నది. అటు ప్రభుత్వం కూడా ప్రజల సంక్షేమం ముందు..ఉద్యోగుల జీతబత్యాలు తర్వాత అన్నట్టు వ్యవహరిస్తున్నదని, ఉద్యోగుల కంటే ప్రజలు అత్యధిక శాతం ఉండటంతో వారికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నదని ఉద్యోగులు సైతం బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఆందోళనలు చేపడుతున్నారు. ప్రస్తుతం అవన్నీ ప్రజలందరికీ తెలియజేసేందుకు మీడియా మొత్తం ఏకమవుతున్నది. ఇప్పటికే మీడియాని  ప్రభుత్వం పూర్తిగా అనగదొక్కుతుందనే బావనలో వున్న మీడియా కూడా తన పని తాను చేసుకుంటూ పోతున్నది. పరిస్థితి ఇపుడే ఇలా ఉంటే ఎన్నికలు దగ్గరపడే సమయానికి ముదిరి పాకాన పడే అవకాశాలే సుస్పష్టంగా కనిపిస్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తుంది..!