గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అరుదైన గౌరవం


Ens Balu
37
Mussoorie
2022-12-25 07:34:02

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్.జగన్మోహనరెడ్డి ప్రభుత్వం 2019లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అరుదైన గుర్తింపు లభించింది. దేశంలోనే ప్రప్రధమంగా ఏపీలోని 26 జిల్లాలో 14వేల5 గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒకేసారి లక్షా 20వేల మంది రెగ్యులర్ ఉద్యోగులను నియమించింది. సచివాలయాల్లో ప్రజలకు అందే సేవలను ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(సివిల్ సర్వీస్ అధికారుల శిక్షణా కేంద్రం) పాఠాల్లో వివరించారు. తద్వారా ఒకేసారి ఐఏఎస్ అధికారులకు శిక్షణలో విషయం తెలిసింది. ఇప్పటికే సచివాలయ వ్యవస్థను దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు వచ్చి అధ్యయనం చేశారు. సచివాలయాలతోపాటు రైతుభరోసా కేంద్రాలు, అగ్రిల్యాబ్ లు, విలేజ్ హెల్త్ క్లినిక్ లు తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా విశేష గుర్తింపును తెచ్చుకున్నాయి.