జనవరి నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే విశేష పర్వదినాలను టిటిడి ప్రకటించింది. జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం, 2న తిరుమల శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 3న శ్రీ స్వామి పుష్కరిణి తీర్థ ముక్కో టి. శ్రీవారి చక్రస్నానం, 7న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం, 7 నుండి 13వ తేదీ వరకు ఆండాళ్ నీరాటోత్సవం, 14న భోగిపండుగ, 15న తిరుమల శ్రీవారి సన్నిధి లో అధ్యయనోత్సవం సమాప్తి. మకర సంక్రాంతి,16న కనుమ పండుగ. తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేస్తారు. తిరుమలనంబి సన్నిధికి వేంచేపు. శ్రీ గోదాపరిణ యోత్స వం,26న భారత గణతంత్ర దినోత్సవం. వసంత పంచమి, జనవరి 28న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.