బీఆర్ఎస్ కి జాతీయ హోదా కోసం విశ్వప్రయత్నాలు


Ens Balu
14
Delhi
2023-01-03 03:53:14

భారతీయ రాష్ట్ర సమితి 2024 నాటికే జాతీయపార్టీ హోదా తెచ్చుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వే స్తుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో తమపార్టీని విస్త్రుతం చేసేందుకు రాష్ట్రాధ్యక్షుడిని నిలబెట్టడంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులను కూడా బరిలోకి దించే ప్రయత్నాలు ఇప్పటి నుంచే  ప్రారంభించింది. సాధ్యమైనంత త్వరతగా బీఆర్ఎస్ కి జాతీయ పార్టీ హోదావస్తే బీజేపీని ఢీకొట్టాలన్నది బీఆర్ఎస్ ఎత్తుగడగా కనిపిస్తుంది. కాగా ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం(ఈ నిబంధనను కాలానుగుణంగా మారుస్తున్నారు)  

చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 6% ఓట్లు సాధించాలి. దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. లేదా కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. లేదా గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి. ఇవన్నీ జరగాలంటే కనీసం ఐదు నుంచి ఆరు రాష్ట్రాల్లో భీఆర్ ఎస్ ను బలంగా నిలబెట్టాల్సి వుంది..!