ఆధార్ కార్డులో అడ్రస్ అప్ డేట్ ప్రక్రియ ఇకపై మరింత సులభతరం చేసింది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకూ ఆధార్ అడ్రస్ అప్ డేట్ చేసేందుకు ప్రతి ఒక్కరూ తమపేరు మీద ధ్రువీకరణపత్రం సమర్పించేవారు. కాగా ఆధార్ లో అడ్రస్ మార్చుకునేందుకు కుటుంబ పెద్ద పేరుతో ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. ఒకవేళ అది సరైంది కాకుంటే ఉడాయ్ సూచించిన పద్ధతిలో కుటుంబ పెద్ద స్వీయ ధ్రువీకరణ సమర్పించాలి. ఆధార్ అప్డేటేషన్ లో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నూతన మార్పులను చేపట్టింది.