వైఎస్సార్సీపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సుమారు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతుంది. కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఒడిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున అభ్యర్ధులను నిలబెట్టాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ కి ఆనుకొని ఉన్నరాష్ట్రాలే కావడం విశేషం. దానికోసం అధికారంలో వున్న పార్టీకి వచ్చే రాజ్యసభ సీట్లన్నీ అయా రాష్ట్రాల్లోని పలుకుబడి ఉన్న రాజకీయ నేతలకు కట్టబెట్టి, పార్టీ తరపున అభ్యర్ధులను బరిలో నిలబెట్టడం కోసి ఇప్పటికే ఆయారాష్ట్రాల్లోని ముఖ్య నేతలతో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఒక కాగా ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం(ఈ నిబంధనను కాలానుగుణంగా మారుస్తున్నారు) చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి.
ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 6% ఓట్లు సాధించాలి. దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. లేదా కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. లేదా గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను
గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి. ఇవన్నీ జరగాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్సీపీ బలమైన అభ్యర్ధులను నిలబెట్టాల్సి వుంది..!