ఒకే విద్యార్ధి..ఒక ఉపాధ్యాయుడు..ఒక పాఠశాల


Ens Balu
16
Ganeshpuri
2023-01-23 04:40:03

ఒక విద్యార్ధి..ఒక ఉపాధ్యాయుడు..ఒక పాఠశాల ఏంటి కేప్షన్ బాగుంది అనుకుంటున్నారా..అవునండి ఇది ముమ్మాటికీ నిజం..మహారాష్ట్రలోని వాషిమ్‌ జిల్లాలో ఓ 
ప్రభుత్వ పాఠశాల ఒక్క విద్యార్థి కోసమే అక్కడి ప్రభుత్వం నడుపుతోంది. 150 మంది వరకూ నివసిస్తున్న గణేశ్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి 
వరకు బోధిస్తున్నారు. అయితే ఆ స్కూల్‌లో కార్తిక్‌ షెగ్‌కర్‌ అనే విద్యార్థి మాత్రమే చదువుకుంటున్నాడు. అతని కోసం మధ్యాహ్న భోజనంతోపాటు అన్ని వసతులు 
కల్పిస్తుంది మహారాష్ట్ర ప్రభుత్వం. కిశోర్‌ అనే టీచర్‌ రోజూ 12 కి.మీ దూరం ప్రయాణించి బాలుడికి పాఠాలు నేర్పిస్తున్నాడు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో 
రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలను అనుసంధానిస్తున్న తరుణంలో ఒక విద్యార్ధికోసం ఏకంగా పాఠశాలను నడిపిస్తున్న అంశం ఇపుడు ఇపుడు దేశవ్యాప్తంగా 
చర్చనీయాంశం అవుతుంది. అంతే కాదు ఏపీలోనూ ఈ విషయాన్ని చాలా మంది ఉపాధ్యాయులు ట్రోల్ చేస్తున్నారు. ప్రభుత్వం అనుకుంటే ఒక్క విద్యార్ధికైనా 
చదువు చెప్పడానికి ఉపాధ్యాయుడిని నియమించి పాఠాలు చెప్పిస్తుందనడానికి మహారాష్ట్రలోని గణేష్ పూర్ ప్రభుత్వపాఠశాల నిదర్శనం.