తారకరత్నకు ఎక్మో అమర్చలేదు..జూ ఎన్టీఆర్


Ens Balu
26
Bengaluru
2023-01-29 07:36:09

తారకరత్నకు ఎక్మో అమర్చినట్టు వస్తన్న వార్తలో నిజం లేదనం జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. బెంగళూరులోని ఆసుపత్రలో చికిత్స పొందుతున్న తారకరత్నను ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో కలిసి ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతోందన్నాడు. 'తారకరత్న కూడా పోరాడుతున్నారు. ఆయన ఆత్మబలం, మనోబలం, అభిమానుల ఆశీర్వాదం, తాతగారి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలి. ఆయన ఈ పరిస్థితి నుండి త్వరలోనే బయటికి వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం వైద్యానికి తారకతర్న స్పందిస్తున్నారని పేర్కొన్నాడు జూనియర్ ఎన్టీఆర్.