జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.123 కోట్లు


Ens Balu
28
Tirumala
2023-02-01 03:41:37

జనవరిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటింది. జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తిరుమల శ్రీవారికి హుండీలో రూ.123  
కోట్లను భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. జనవరి 2 తేదీన శ్రీవారికి రూ.7.68 కోట్ల హుండీ ఆదాయం లభించింది. టీటీడీ చరిత్రలోనే ఇది
అత్యధిక ఆదా యాల్లో రెండోది. శ్రీవారి హుండీ ఆదాయం ప్రతి నెలా రూ.కోట్లు దాటుతుండడం గమనార్హం. స్వామివారి వచ్చే ఆదాయంలో టిటిడి ఆలయాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది.