ఫిబ్రవరి 5న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ


Ens Balu
31
Tirumala
2023-02-02 12:56:08

తిరుమలలో ఫిబ్రవరి 5వ తేదీ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తూ వస్తున్నారు.     ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. గరుడసేవకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటి అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. స్వామివారికి చేసే సేవలను ఎస్వీబీసీ ద్వారా భక్తులకు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందిస్తారు.