14న వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల
Ens Balu
13
Tirumala
2023-02-13 06:02:50
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఆన్‌లైన్ కోటాను ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలియజేసింది. ఈ మేరకు మీడియాకు ప్రకటన విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.