హైదరాబాద్ లో ర్యాగింగ్ బూతానికి బలైపోయిన మెడికో ప్రీతి మ్రుతిపై తెలంగాణలోని మావోయిస్టులు స్పందించారు. దీనితో ఈ విషయం రాష్ట్రంలోనే సంచలనం అయ్యింది. ఇప్పటి వరకూ ర్యాగింగ్ ను ఏ విద్యాసంస్థలోనూ నియంత్రించలేదు. దానిని అడ్డుకోనూకూడా లేదు. అయితే ఇన్నాళ్లూ నోరుమెదపని మావోయిస్టులు మెడికో ప్రీతి మ్రుతిపై స్పందించడాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సీనియస్ గానే తీసు కుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా డివిజన్ కార్యదర్శి వెంకట్ పేరిట విడుదలైన లేఖలో ర్యాగింగ్ వలనే ప్రీతి ఆత్మహత్య చేసుకుంద ని..అయి నా దానిని అధికారులు, ప్రభుత్వం కప్పిపుచ్చుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం మావోయిస్టులు నుంచి వచ్చిన స్పందనలేఖపై పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ర్యాగింగ్ కు పాల్పడ్డ వ్యక్తి,పై నిఘా ఏర్పాటు చేసినట్టు సమాచారం అందుతోంది. కాగా మ్రుతిచెందిన మెడికో ప్రాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10లక్షలు వెలకట్టడాన్ని మెడికోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.