జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ..
Ens Balu
2
Hyderabad
2020-09-26 20:59:41
భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తన బలాన్ని పెంచుకోవడానికి పక్కా ప్రణాళికతో వస్తున్నట్టు కనిపిస్తుంది. దానికోసం జాతీయ స్థాయిలో మహిళా విభాగాన్నే కమల దళం ఏర్పాటు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో అధికార పీఠాన్ని దక్కించుకునేనా బలమైన సామాజిక వర్గంలోని మహిళలకు కీలక పదవులను కట్టబెట్టింది. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ (భాజపా) తన జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన డీకే అరుణ, పురందేశ్వరిలకు జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. తెలంగాణకు చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించగా.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరిని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏపీకి చెందిన సత్యకుమార్ జాతీయ కార్యదర్శిగా యథావిధిగా కొనసాగనున్నారు.