గుగూల్ పే, పేటిఎం, ఫోన్ పే లకు కాలం చెల్లిపోతుంది..!


Ens Balu
84
New Delhi
2023-05-18 01:09:39

భారత దేశంలో గుగూల్ పే, పేటిఎం, ఫోన్ పే లకు మెల్లగా కాలం చెల్లిపోతుంది. మొదట్లో అన్నివర్గాలకు చేరువైన ఈ పేమెంట్ యాప్ లు త్వరలో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ లో యూపిఐ పేమెంట్ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసింది. నేడు ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ యాప్ జొమోటా కూడా యూపీఐ పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తీసు కు వచ్చింది. అందులోనూ ఫోన్ పే లో చేసే పేమెంట్లకు ఒక రూపాయి నుంచి రూ.2 లు అధనంగా ఛార్జ్ చేయడంతో వినియోగదారులు ప్రభుత్వ యాప్ లను ఆశ్రయిస్తున్నారు. యూపిఐ విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతీ సంస్థ ఇపుడూ థర్డ్ పార్టీ యాప్ లపై ఆధారపడ టం మానేస్తున్నాయి. ప్రస్తుతం వాట్సప్ ద్వారా కూడా యూపిఐ పేమెంట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా త్వరలో మరిన్ని సోషల్ మీడియా యాప్ లు కూడా యూపిఐ పేమెంట్ విధానాలను అందుబాటులోకి తేనున్నాయని సమాచారం.