కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతున్నది. ఆదివారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 87,967మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు రాగా, 32,083 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి నిత్యంచేసే సేవలు,దర్శనాలు యధావిధిగా కొనసాగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది.