కేంద్ర ప్రభుత్వం గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించికీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆన్ లైన్ మోసాలు దేశ వ్యాప్తంగా అత్యధికంగా జరుగుతు న్నందున ప్రభుత్వం హెచ్చరిక జారీచేసినట్టు తెలుస్తుంది. బెట్టింగుల తరహా కార్యకలాపాలను నిర్వహించే వేదికలకు సంబంధించిన ప్రకటనలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం మానుకోవాలని వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమ సంస్థలకు అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆన్ లైన్ బెట్టింగ్ లకు సంబంధించిన అనేక రకాల యాప్ లు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి అనేక మంది వీటి భారీన పడి లక్షలాది రూపాయలు మోసాలకు గురవుతున్నారు. దీనితో వీటిని పూర్తిగా నిషేధించే క్రమంలో కేంద్రం జారీ చేసింది. ఈ ఉత్తర్వులను పాటించని సంస్థలు న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవా ల్సి ఉంటుంది. ఆన్ లైన్ మోసాలపై ప్రతినిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.