కలియుగ వైంకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నది. శనివారం అర్ధరాత్రివరకూ శ్రీవారిని 71,073 మందిభక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు రాగా, 37,215 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇంకా దర్శనంకోసం 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారికి కొన్ని నిత్యంచేసే సేవలలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసినట్టు ఒక ప్రకటనలో తెలియజేసింది.