నీతి ఆయోగ్‌ భవిష్యత్‌ ప్రణాళికలో వైజాగ్‌కు చోటు


Ens Balu
39
Delhi
2023-09-20 07:39:47

కేంద్ర ప్రభుత్వం విశాఖ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్‌ గ్రోత్‌ హబ్‌ నగరాల్లో విశాఖకు చోటు కల్పించింది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నాలుగు నగరాలను నీతి ఆయోగ్‌ ఎంపిక చేయగా అందులో వైజాగ్‌కు చోటు దక్కింది.. దక్షిణాది రాష్ట్రాల నుంచి విశాఖను ఎంపిక చేయగా, మిగతా వాటిలో ముంబై, సూరత్‌, వారణాసి ఉన్నాయి. వీటిని పైలట్‌ నగరాలుగా కేంద్రం ఎంచుకుంది. 2047 అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చేందుకు పైలట్ ప్రాజెక్టు ప్రవేశపె ట్టగా,  తాజాగా ఎంపికైన నాలుగు నగరాలలో పైలట్‌ ప్రాజెక్టు అమల్లోకి రానుంది. నీతి ఆయోగ్‌ ఎంపిక చేసిన నగరాల్లో భారీ ఎత్తున ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపా యాలు అభివృద్ధి చేయనుంది. ఇప్పటికే పలు కీలక అభివృద్ధి విషయాల్లో ముందున్న విశాఖ నీతి ఆయోగ్ భవిష్యత్ ప్రణాళికతో మరింత అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నట్టుగా ప్రకటించిన తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రప్రభుత్వం ప్రకటన రాజధాని ప్రకటన చేసినా దానికి సంబంధించి అధికారిక కార్యక్రమాలు చేపట్టేలేదు. మరోవైపు డిసెంబరులోగా రాజధాని కార్యకలాపాలు ప్రారంభం అయితేనే ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనకు కార్యరూపం వస్తుంది. ఆతరువాత ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.