అన్నంపెట్టే రైతన్న ఆరోగ్యంగా ఉంటే దేశం శుభిక్షంగా ఉంటుందని..అలాంటి రైతు యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యతను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్టు మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షలు, టిడిపి యువనాయకులు ఆడారి కిషోర్ కుమార్ తెలియజేశారు. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మిషన్ బృందం వ్యవసాయ ఆధారిత ప్రాంతాల వారీగా రైతుల స్థితిగతులు, చేస్తున్న వ్యవసాయ విధానాలు, అభివృద్ధి, రైతుల కష్టాలు, రైతులు సాధిస్తున్న విజయాలు, తదితర అంశాలపై ప్రచారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు మిషన్ అధ్యక్షులు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి భవిష్యత్ కార్యాచరణ వివరాలను ప్రత్యేకంగా తెలియజేశారు. కర్షకదేవోభద మిషన్ కార్యక్రమం రైతు యొక్క అవసరం మానవాళికందరికీ తెలియజేయాలనే లక్ష్యంతో జరుగుతోందన్నారు. కరోనా వైరస్ విలయతాండం చేసిన సమయంలో రైతు లేకపోయినా, రైతు పంటలు పండించకపోయినా జరిగే నష్టం ఊహకి కూడా అందేది కాదన్నారు. ప్రపంచ విపత్తు సమయంలోనూ ప్రాణాలను పణంగా పెట్టి వ్యవసాయం చేసి, వాటి ఫలాలను అన్ని వర్గాలకు అందించడం ద్వారానే ప్రజలకు ఆరోగ్యం సిద్ధించదనే విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందన్నారు.
అలాంటి రైతుని ఆరోగ్యంగా ఉంచితే ఆ ఫలాలు ప్రజలందరికీ చేరుతాయని అన్నారు. రైతులు వ్యవసాయం దండగ అనుకుంటే.. కార్పోరేట్ శక్తులు ప్రజల రక్త, మాంసాలను కూరగాయలు, బియ్యం, పండ్లుకి అత్యధిక ధరలు పెట్టి పీడించేస్తాయన్న ఆయన.. ప్రస్తుత మానవ మనుగడకు గాలి, నీరు, ఎంత అవసరమో రైతు, ఆయన చేసే వ్యవసాయం కూడా అంతే అవసరమన్న విషయాన్ని ప్రజలు గుర్తించే వరకూ మిషన్ కర్షకదేవోభవ తనకార్యకలాపాలు నిర్విరామంగా చేస్తూనే ఉంటుందన్నారు. అంతేకాకుండా రైతులకు ప్రకృతి, సేంద్రియ వ్యవసాయాన్ని చేరువ చేయడానికి రైతులకు కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉందన్నారు. దానికోసం వ్యవసాయ విద్య చదిన విద్యార్ధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రైతు రాజైతే ప్రజలకు ఆరోగ్య, ఆహారం రెండూ చేరువ అవుతాయని..అది జరగాలంటే కాస్త సమయం పడుతుందన్నారు. రైతు దేశానికి వెన్నుముఖ అనే విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పోరేట్ సంస్థలు, అన్ని వర్గాలు గుర్తించే స్థాయికి రైతు అవసరాన్నితీసుకెళతామన్నారు.
జాతీయ స్థాయిలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రతీ ఇంట్లో ఒక ఉద్యోగి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎలా ఉంటున్నారో..ఒక రైతు కూడా ఉండాలనే ఆలోచన కల్పించడానికి వినూత్న కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని చెప్పుకొచ్చారు. త్వరలోనే వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో పర్యటనలు కూడా చేపట్టి అక్కడి అభవృద్ధి విధానాలపై అధ్యయనాలు కూడా చేయిస్తామన్నారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే కొత్త వంగడాల రూపకల్పన జరగాలని, అది కార్యరూపం దాల్చాలంటే వ్యవసాయ విద్య, పరిశోధనలు విస్త్రుతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి రైతు మానవాళికి, జీవకోటికి ఎంత అవసరమో చాటిచెప్పి ప్రపంచ వ్యవసాయాధినేతగా రైతుని నిలబెడతామని స్పష్టంచేశారు మిషన్ కర్షకదేవోభవ జాతీయ అధ్యక్షలు, టిడిపి యువనాయకులు ఆడారి కిషోర్ కుమార్..!