డెమెక్రసీ ఇన్ డేంజర్ ఉద్యమంపై ఆడారికి చంద్రబాబు ప్రశంస


Ens Balu
52
Delhi
2023-11-27 13:34:23

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను డెమెక్రసీ ఇన్ డేంజర్ ఉద్యమం ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్న టిడిపి యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. సోమవారం చంద్రబాబునాయుడుని  ఢిల్లీ ఓబె రాయ్ హోటల్ లో కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, డెమెక్రసీ ఇన్ డేంజర్ పేరిట యువతను ఉత్తేజ పరచడంలో చేస్తున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని కొనియాడారు. రాష్ట్రంలో యువత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన నష్టం కోసం తెలుసుకో గలిగితే మీరు చేస్తున్న ఉద్యమం మరింతగా అన్ని వర్గాల ప్రజల్లోకి వెళుతుందన్నారు. అదేవిధంగా సామాజిక దృక్పదంతో రైతుల కోసం చేస్తున్న మిషన్ కర్షక దోవోభవ చక్కని కార్యక్రమమని అన్నారు. ఇప్పటి వరకూ ఢిల్లీ నుంచి అనకాపల్లి వరకూ డేంజర్ ఇన్ డెమెక్రసీ, సేవ్ డెమెక్రసీ కార్యక్రమాల విశేషాలను కిషోర్ కుమార్ చంద్రబాబుకి తెలియజేశారు. టిడిపిలో కష్టపడి పనిచేసేవారికి ఎల్లప్పుడూ గుర్తింపు వుంటుందని, దైర్యంగా మీ కార్యక్రమాలను కొనసాగించాలని బుజం తట్టి ప్రోత్సహించారు. ఆంధ్రప్రేదేశ్ లో యువతకు జరిగిన అన్యాయం, యువ నాయకత్వం ద్వారా ప్రజలకు తెలియాలన్నారు. ఈ అరాకచక పాలనకు ప్రజలు చరమగీతం పాడే సమయం దగ్గర పడిందని అన్నారు.  ఆయనను కలిసిన అనంతరం కిషోర్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధినేత తాను చేపట్టే కార్యక్రమాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు. విమానం లోనూ, విశాఖ క్రికెట్ స్టేడియంలోనూ, డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమాలను ఆయనకు వివరించానని అన్నారు. దానికి ఆయన ఇచ్చిన స్పూర్తి, ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనని అన్నారు. వైఎస్సార్సీపీ చేపడుతున్న అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, కక్షసాధింపు చర్యలను అన్ని వర్గాల ప్రజల వద్దకూ తీసుకెళ్లడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.