నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆడారి కిషోర్


Ens Balu
112
New Delhi
2023-11-28 13:30:29

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు సతీమణి, మహిళానేత నారాభువనేశ్వరిని మిషన్ కర్షక దేవోభవ జాతీయ అధ్యక్షలు, టిడిపి యువనాయకులు ఆడారి కిషోర్ కుమార్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఢిల్లీలోని ఓబెరాయ్ హోటల్ లో ఆమెను కలిసి డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని, కక్షసాధింపులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని మండి పడ్డారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమం అన్ని వర్గాలనూ ఆలోచించేలా చేస్తుందని అన్నారు. అదేవిధంగా మిషన్ కర్షకదేవోభవ కార్యక్రమం కోసం కూడా ఆడారి కిషోర్ కుమార్ తో చర్చించారు. యువత చైతన్యం కోసం, రైతుల అభివృద్ధి కోసం చేపడుతున్న మంచి పనులను భువనేశ్వరి అభినందించారు. టిడిపి ఎంతో చరిత్రకలిగిన పార్టీ అని..అలాంటి పార్టీలో యువచైతన్యానికే పెద్ద పీట ఉంటుందనే విషయాన్న ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. మంచి పనులు చేసే మీకు పార్టీ సహకారం, తమవంతు సహకారం ఎల్లప్పడుతూ వుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, గత మూడు రోజులుగా టిడిపి అధినేతతోపాటు తాను ఢిల్లీలోనే ఉన్నానని చెప్పారు. తాను చేపడుతున్న కార్యక్రమాలు ఢిల్లీ వేధికగా చేపడుతున్న విషషయాన్నిఅధినేత సతీమణి  దృష్టికి తీసుకొచ్చామని, తమ పార్టీ అధ్యక్షులు,  సతీమణి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేదని అన్నారు. వారి సహకారంతో గ్రామ, గ్రామన డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని వర్గాల్లోనూ చైతన్యం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని చెప్పారు. అనంతరం ఢిల్లీ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకి సాదర వీడ్కోలు పలికారు. అంతకు ముందు మాజీ మంత్రి నారాయణను కూడా ఆడారి కిషోర్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.