సింహాచలం శ్రీ వరాహ లక్ష్మినరసింహ స్వామి(సింహాద్రి అప్పన్న)ని మంగళవారం స్టాండింగ్ కమిటీ చైర్మన్ లోక్ సభ సెక్రటేరియట్ ఎనర్జీ బ్రాంచ్ స్టాండింగ్ కమిటీ సభ్యులు జగదాంబిక పాల్, చైర్ పర్సన్ కిసాన్ కపూర్, ఎంపీలు సునీల్ కుమార్ మోండల్, కె ఆర్ ఎన్ రాజేష్ కుమార్ దర్శించుకున్నారు.వీరికి ఆలయ సహాయ కార్య నిర్వహణాధికారి డి భ్రమరాంబ, పర్యవేక్షణ అధికారి పిల్ల శ్రీనివాస్, ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి నాదస్వర వేదమంత్రాల నడుమ ముందుగా కప్పస్తంభం అలింగనం తదుపరి బేడా ప్రదక్షణ చేయించారు.అనంతరము స్వామివారి దర్శనము, అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు జరిపించి వేద పండితులచే వేద ఆశీర్వచనము ఇచ్చి ఆలయ కార్య నిర్వహణ అధికారి స్వామి వారి పటము ప్రసాదాలను అందజేశారు.