అనకాపల్లి ఎంపీగా అవకాశం కల్పించండి.. చంద్రబాబుని కోరిన కిషోర్


Ens Balu
118
Delhi
2024-02-08 09:07:50

అనకాపల్లి ఎంపీగా ఒక్క అవకాశం ఇస్తే తానేంటో నిరూపించుకుంటానని టిడిపి యువనాయకులు ఆడారి కిషోర్ కుమార్ తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడుని కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీ లో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు ను ఎంపి గల్లా జయదేవ్ ఇంట్లో కలిశారు.  సామాజికపరంగా, యువత పరంగా తన గెలుపునకు గల అవకాశాలు ఎంతమేర ఉన్నాయో కూడా చంద్రబాబుకి వివరించారు. బిజెపీతో పొత్తుపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుని కలిసి అనకాపల్లి ఎంసీ సీటు అభ్యర్ధించడం, దానికి చంద్రబాబు తప్పకుండా పేరు పరిశీలనలోకి తీసుకుంటామని చెప్పడం కూడా చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబు అరెస్టు అయిన తదగ్గర నుంచి ఆడారి కిషోర్ కుమార్ అనేక రూపాల్లో యువతను కూడగట్టుకొని మరి ఢిల్లీ వేదికగా తీవ్రస్థాయిలో గళాన్ని వినిపించారు. అంతేకాకుండా ఉమ్మడి విశాఖజిల్లాలో కూడా డెమెక్రసీ ఇన్ డేంజర్, సేవ్ డెమెక్రసీ పేరిట అన్ని పార్టీలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలు, నిసనలు, ఆందోళనలు చేపట్టారు. సుమారు రెండు నెలలు పాటు అలుపెరగకుండా చేసిన కార్యక్రమాలు సైతం టిడిపిలో చర్చనీయాంశం అయ్యాయి. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్న కిషో ఆ దిశగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకి సాగుతున్నారు. అదేవిధంగా పార్టీలోని అన్ని విభాగాల నయకుల మద్దతు కూడా కూడగట్టుకుని తన పనితాను చేస్తున్నారు.