భారత దేశ రాజధాని ఢిల్లీలో ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు సేవలకు విశేష గుర్తింపు లభించింది.. సినిమాల్లోనే కాదు.. అన్ని వర్గాల ప్రజలకు విశేషంగా సేవలదిస్తున్న యువ నటులు, ప్రముఖ సంఘసేవకులు కంచర్ల ఉపేంద్రబాబుకి వచ్చిన సేవా అవార్డుతో ఢిల్లీ స్థాయిలో మరింత గౌరవాన్ని పెంచింది. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించేవారిని ప్రత్యేకంగా గుర్తించి వారిని గౌరవించే తెలుగు ఎంప్లాయిస్ అసోసియే షన్ (సేవా) 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రముఖ సినిమా నిర్మాత, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, టిడిపి నాయకులు, ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు, కళోభోజ, నిశ్వార్ధ సేవకులు డా.కంచర్లత అచ్యుతారవుని ఘనంగా సత్కరించి, సన్మానించడమే కా కుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హోదాలో నిలబెట్టింది.
విశాఖలో నిరాటంకంగా అన్ని వర్గాల ప్రజలకు పెద్ద ఎత్తున సేవలు చేస్తూ.. అందునా జర్నలిస్టులకు అధిక మొత్తంలో ఆరోగ్య సేవలు ముందడుగు వేస్తూ.. వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న డా. కంచర్ల అచ్యుతరావు, ఆయన తనయుడు యువ హీరో ఉపేంద్రబాబు సేవలు ఇపుడు ఢిల్లీ స్థాయిలో విశేషంగా గౌరవాన్ని పెంచాయి. తెలుగు ఎంప్లాయిస్ అసోసియేషన్(సేవా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వాహకులు, అసోసియేషన్ అధ్యక్షులు పి. మురళీ క్రిష్ణ, ఫౌండర్ చైర్మన్ వివి.శేష సాయి, జనరల్ సెక్రటరీ జివిఆర్ మురళి మాట్లాడుతూ, ప్రజలకు అసాధరణ స్థాయిలో సేవలు అందించడం అంటే ప్రస్తుత రోజుల్లో సాధ్యమయ్యే పని కాదని.. కానీ ఎవరికి ఏ కష్టమొచ్చినా మేమున్నామంటూ ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్ డా. కంచర్ల ఆచ్యుతరావు ముందుకి వచ్చి ఇతోదికంగా సేవలు అందిస్తున్నారని నిర్వాహకులు కొనియాడారు.
ఆయన బాటలోనే ఆయన తనయుడు కంచర్ల ఉపేంద్రబాబు కూడా సేవలు అందిస్తూ.. అందరి వాడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఒకేసారి ఎనిమిది సినిమాల్లో హీరోగా అవకాశం రావడం.. తద్వారా వచ్చిన ఆదాయంలో ప్రజలకు సేవలు చేయాలని నిర్ణయించుకోవడం ఒక చారిత్రక అంశమన్నారు. కేవలం డబ్బు సంపాదన కోసమే సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో సినిమాలు తీస్తూ.. కళాకారులకు ఉపాదిని కల్పిస్తూ.. వాటి ద్వారా ఎన్నో విభాగాల కార్మికులకు ఆదాయా మార్గాలు కల్పించడం నిజంగా ప్రజలకు నిండు మనసుతో సేవలు చేయాలనుకున్నవారికి మాత్రమే సాధ్య పడుతుందన్నారు. కుటుంబంలో ఎవరో ఒకరు సేవాకార్యక్రమాలు చేస్తుంటారని.. కానీ కంచర్ల అచ్యుతరావు కుటుంబంలో అందరూ వారి జీవితాలను ప్రజా సేవకే అంకితం చేయడం ఒక చారిత్రాత్మకమని కీర్తించారు.
స్వచ్చంద సంస్థలు, సంపన్నులు, సేవలు చేస్తే అప్పుడప్పుడూ వారికి మంచి అనుకున్నరోజుల్లో సేవలు చేస్తారని.. కానీ ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా శుభ కార్యాలతోపాటు, అనాధ శవాలకు కూడా వారే స్వయంగా తమ ఖర్చులతో అంత్యక్రియలు చేసి.. శాంతి భోజనాలు పెట్టిస్తున్నారంటే వారికి ప్రజా సేవ పట్ల ఎంతటి గౌరవముందో అర్ధం చేసుకోవాలన్నారు. అదేవిధంగా హీరో ఉపేంద్రబాబు అయ్యప్పస్వాములకు పెద్ద ఎత్తున పీఠాలు ఏర్పాటు చేసి స్వామివారి సేవలో తరిస్తున్నారని అన్నారు. సినీ కళాకారులకు కూడా తన సినిమాల ద్వారా ఉపాది అవకాశాలు కల్పిస్తున్నారని ప్రశంసించారు. వీటితోపాటు యువను సన్మార్గంలో ఉంచేందుకు, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతీ ఏటా ఉపకార్ కప్ పేరిట భారీ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్లు.. జర్నలిస్టులు టోర్నమెంట్లు ఏర్పాటు చేసి అన్ని రకాల సేవా కార్యక్రమాలకు పుట్టినిల్లుగా ఉపకార్ ట్రస్టుని తీర్చి దిద్దారని అన్నారు.
అలాంటి మంచి వ్యక్తులను గౌరవించుకోవడం అంటే ఢిల్లీలోని తెలుగువారందరినీ సత్కరించినట్టుగానే భావిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం ఉపేంద్రగాడి అడ్డా సినిమాను ప్రదర్శించి.. ఒక రోజంతా అన్ని కుటుంబాలు సరదా గడిపేందుకు కారణమయ్యారని కొనియాడారు..అనంతరం ఏర్పాటు చేసిన సాంస్క్రుతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. సినిమా ప్రదర్శనకు ముందు హీరో ఉపేంద్రబాబుని చూడటానికి పెద్ద ఎత్తున ఢిల్లీలోని తెలుగువారు, ఉద్యోగులు తరలి వచ్చారు. ఆయనలో సరదాగా సెల్ఫీలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పి. మురళీ క్రిష్ణ, ఫౌండర్ చైర్మన్ వివి.శేష సాయి, జనరల్ సెక్రటరీ జివిఆర్ మురళి తదితరులు పాల్గొన్నారు.
సేవా అవార్డులు పొందిన వారి వివరాలు
సినీ హీరో, నిశ్వార్ధ సేవకులు కంచర్ల ఉపేంద్రబాబు, సిహెచ్ వ్రీనివాసరావు, ఎన్. సత్యన్నారాయణ,వి.రవి, కె.నారాయణరావు, డి.నాగేశ్వర్రావు, ఎస్.ఎన్.సిద్ధి, హితేష్ కుమార్, జి.సీతానాగజ్యోతి, టిఎల్.సీత, కెఎస్ఆర్.చంద్రమూర్తి, మహేష్ సామినేని, పి.రామక్రిష్ణ, సముద్రాలరావన్, టి.సత్యన్నారాయణ, ఎస్.వరప్రసాద్, కెవి.ప్రసాద్, ఆర్.ఎస్.కిరణ్ శర్మ, సుధీర్ చాట్ల, కె.సత్యన్నారాయణ, ఆర్.రవీంద్రబాబు, ఎం.శివక్రిష్ణ ఉన్నారు. కాగా ఈ అవార్డుల కార్యక్రమానికి ముందు అసోసియేషన్ 20వంతాల వేడుకలు జరిగాయి.. అందులో క్యాలండర్ ను ఆవిష్కరిం చారు. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉపకార్ ట్రస్ట్ చైర్మన్, సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు, గెస్ట్ ఆఫ్ హానర్ గా శివానీ ఇన్ఫ్రా అధినేత వాసిరెడ్డి శివనారాయణలు వ్యవహరించారు.