భారతదేశంలో మాజీ ప్రధాని సంతాప దినాలంటే అపహాస్యమే.. పేరుకి సంతాప దినాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకిటించినా.. నేతలు మాత్రం ఆ మధ్యలో వచ్చే నూతన సంవత్సర వేడుకుల మాత్రం తూ..చా.. తప్పకుండా పాటించడానికి ముందుగానే మీడియా ప్రచారాలు చేసుకున్నారు.. అలా చేసుకునేపాలమే అయితే అసలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తరువాత సంతాప దినాలు ప్రకటించడం దేనికి అంటే.. ఆ ఒక్కటీ అంటున్నారు తేడా రాజనీయనేతలు.. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు లాంటి వారు మాత్రం ముందుగానే ఈ ఏడాది తాను.. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నానని.. ఆరోజు తనను ఎవరూ కలవడానికి రావొద్దని..మాజీ ప్రధాని మృతితో రాష్ట్రంలో సంతాప దినాలు జరుగుతున్నాయని ఎంతో గౌరవంగా ప్రకటించారు..!
రాజకీయ నేతలకు సిగ్గుండదు.. వారి మాటలకు విలువ ఉండదు అంటే ఏమో అనుకుంటారు జనాలు కానీ.. వారే ప్రకటించి.. వారే పాటించని విధానాలు చూసినపుడు మాత్రమే తేడా రాజకీయనేతల గొప్పతనం బయట పడుతుంది. భారతదేశంలో ప్రధాని, రాష్ట్రపతి, తరహా వారు ఎవరైనా మృతి చెందితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదిరోజులు సంతాప దినాలు ప్రకటిస్తాయి. అంటే ఆ పది రోజుల్లో ఎలాంటి వేడుకలు, ఆర్బాటాలు చేయరు. అనూహ్యంగా ఇటీవలే మాజీ భారత ప్రధాని డా.మన్మోహన్ సింగ్ మృతిచెందారు. అప్పుడే కేంద్ర, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు పదిరోజులు సంతాప దినాలు ప్రకటించాయి.
బహుసా పేరుకి మాత్రమే ప్రకటించాయనుకుంటా.. అందరూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటామని.. కొత్త వేడుకల్లో పాల్గొనడానికి తమ తమ కార్యాలయాల్లో సిద్దంగా ఉంటామని రెండ్రోజులు ముందుగానే మీడియా ప్రకటనలు చేసేశారు. అందులో ఎంపీలు, మంత్రులు, ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీలు, ఇతర కార్పోరేషన్ల చైర్మన్లు కూడా ఉండటం విశేషం. సంతాప దినాలు అంటే బహుసా మీడియాలో గొప్పకి ప్రకటిస్తారు గానీ.. ఎవరూ పాటించరు.. అనుకొని వీరంతా నూతన సంవత్సర ఉత్సవాల్లో పాల్గొంటున్నారో ఏమో తెలీదుగానీ.. పోటా పోటీగా ప్రజాప్రతి నిధులం తా ముందుగా మీడియా ప్రకటనలు ఇచ్చేశారు. అంటే మాజీ ప్రధానుల మృతి.. ఆపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంతాప దినాలు అన్నీ ఉత్తుత్తివేనని వీరే అపహాస్యం చేస్తున్నారు.
వాస్తవానికి ఈ విషయం ఏ ఒక్క ప్రజాప్రతినిధినో కించపరచడానికి కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంతాప దినాలు అంటే ఎంత మంది ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి, ఇతర కార్పోరేషన్ చైర్మన్లు, అధికారులకు తెలుసు అనేది ప్రజలకు తెలుసుకుంటారని మాత్రమే. బ్రతికుండగా పార్లమెంటు సాక్షిగా రాజకీయాలు చేసుకున్న వీరే.. కనీసం వారిలో ఒక మాజీ ప్రజాప్రతినిధి, అందునా ప్రధాని మృతిచెందిన తరువాతర ఆయనకి గౌరవం ఇవ్వాలని ప్రజప్రతినిధులకు అనిపించలేదు అనడానికి నేడు జరుగుతున్న నూతన సంవత్సర ఉత్సవాల్లో పాల్గొన్న నేతలకే వదిలేయాలి ప్రజలు.
అంటే కనీస అవగాహన, ప్రభుత్వ విధి విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంతాప దినాలు తెలియని.. తేడా ప్రజలు ఎన్నుకున్నారనే విషయం ప్రజలకు తెలియజెప్పడానికే బహుసా వీరంతా సంతాపదినాలు జరుగుతున్న సమయంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటున్నామని ప్రచారం చేసుకోవడం శోచనీయం. అవగాహన లేని ప్రజాప్రతినిధులు ప్రచారం కోసం ఈ విధంగా చేస్తున్నారనుకుంటే.. వారి వద్ద ఉన్న ఉన్నతాధికారులకైనా అవగాహన ఉండాలి కదా అంటే.. ఇలాంటివి ఎవరు పట్టించుకుంటారు లే అన్నట్టుగా ఆ... తేడా ప్రజాప్రతినిధుల వద్ద పనిచేస్తున్న అధికారులు కూడా సిగ్గూ, శరం, మా ప్రధాని మృతి సంతాప దినాలంటే గౌరవం లేనట్టుగా బావించాల్సి వుంటుంది.
భారతదేశం అన్నా.. ఇక్కడి ప్రభుత్వాలన్నా అందరూ ఎంతో గర్వంగా చెప్పుకుంటారు.. కానీ.. ప్రముఖల మృతి తరువాత వేడుకలు జరుపు కునే నేతలున్న భారతదేశమని, కేంద్రంలో పనిచేస్తున్న ఎంపీలని.. రాష్ట్రప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారని కూడా అంతే తేడా గా చెప్పుకుంటారు.. దివంగత డా.మన్మోహన్ జీ.. మరోలా అనుకోకండి.. మేము తేడా రాజకీయ నేతలం.. మాకు చావులపైనా.. సంతాప దినాల పైనా అవగాహన లేదు.. మీరు ఫీలవకండి.. మేము ఇంతే.. చేతనైతే ఆ పైలోకంలో ఉన్న మీలాంటి మంచివారంతా భూలోకంలోని తేడా ప్రజా ప్రతినిధుల కనీసం సంతాపదినాలు కూడా పాటించడం లేదని మాట్లాడుకోండి.. అవీ కూడా క్రిందనున్న నేతలకు వినిపించవు కదా.. మణ్ణిం చండి.. మణ్ణించండి.. మేమింతే..?!