విశాఖ రైల్వేజోన్ ఉత్తరాంధ్ర ప్రజల సెంటింమెంట్..ఎన్నేళ్ల నుంచో నలుగుతున్న ప్రతిపాదన..భారతీయ రైల్వేకి ఆదాయం తెచ్చే డివిజ న్లలో రెండో అతిపెద్ద డివిజన్ వాల్తేరు మాత్రమే.. అదీ అరకు రూటులోని కెకె లైన్..సుమారు పదివేల కోట్లకు పైనే ఆదాయం ఇపుడు ఒరిస్సా జోన్ లోకి వెళ్లిపోయింది.. ఇంత జరుగుతున్నా కూటమి ఎంపీలు మాత్రం నోరు మెదపడం లేదు.. రైల్వేజోన్ సాధించామని సంబురాలు చేసు కుంటున్నారు తప్పితే.. జోన్ కి తల తీసుకెళ్లిపోయి.. కేవలం మొండెం మాత్రం మిగిల్చారనే విషయాన్ని గుర్తించడం లేదు..అందునా ఉత్త రాంధ్రాలోనే రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వ్యవహరిస్తున్నారు.. ఎంపీలు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే.. మన విశాఖ రైల్వో జోన్ పరిధిలోని అరకు లైన్ మనకి దక్కుతుంది... వైఎస్సార్సీపీ అరకు ఎంపీ తప్పా నేటికీ కూటమి ఎంపీలు ఈ విషయంలో పల్లెత్తు మాట కేంద్రం వద్ద మాట్లాడటం లేదు..!
అలా ఆదాయం వచ్చే కెకె లైన్ ను ఒరిస్సాకి కట్టబెట్టేసిన కేంద్రం.. ఎంగిలి చేత్తో కాకిని కొట్టినట్టు నామ్ కే వాస్తే విశాఖ జోన్ ను ఉత్తరాంధ్రకి విదిల్చింది. అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు. అలాగని అరకు, కెకెలైన్ ఒడిస్సాలోకి పోతున్నా వాల్తేరు డివిజన్ పరిధిలోకి వచ్చే 9 మంది ఎంపీలు నోరు మెదపడం లేదు. విశాఖ జోన్ వచ్చిందే చాలన్నట్టుగా మురిసిపోతున్నారు. కేంద్రంలో చాలా పట్టువుందని చెప్పుకునే కూటమి ప్రభుత్వం వాల్తేరు రైల్వే డివిజన్ లో ఏడాదికి రూ.10వేల కోట్లు వచ్చే మార్గాన్ని ఒడిస్సాతన్నుకుపోతే నోరు మెదపలేదు. దీనితో ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం తలపెట్టినట్టైంది కేంద్రం. ఇప్పటి వరకూ వాల్తేరు డివిజన్ లో ఉన్న అరకు ఇప్పుడు ఒరిడ్సా లోని రాయగడ డివిజన్ కు వెళ్ళిపోయింది. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోరు మెదరపలేదు సరికదా.. రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న అనకాపల్లి ఎంపీతో కూడా ఒక్క మాట కూడా అడిగించలేదుకపోయింది.
కానీ వైఎస్సార్సీపీ నుంచి అరకు ఎంపీగా ఉన్న గుమ్మ తనూజా రాణి మాత్రం కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి.. ఒక వినతి పత్రాన్ని సమర్పించి ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో ఒక్క అడుగు ముందుకి వేశారు. విశాఖ రైల్వే జోన్ పరిధి ఇపుడు కొత్త వలస వరూ మాత్రమే వుంది.. అక్కడి నుంచి మిగిలిన ప్రాంతం అంటే బచేలీ వరకూ ఉన్న రైల్వే లైను ఒరిస్సాలోని రాయగడ జోను బదిలీ అయిపొయింది. విశాఖలోని వాల్తేరు రైల్వే జోన్ కి కిరండోల్ లైన్ నిజంగా గుండెకాయలాంటిదే. జోన్ కి ఏడాదికి రూ.10 వేల కోట్లకు పైనే ఆదాయం కిరండోల్ లైన్ మీదనే వచ్చే మార్గాన్ని రాయగడజోన్ తన్నుకు పోయింది. విశాఖ రైల్వే జోన్ లో కిరండోల్ లైను లేక పోతే ఉత్త జోన్ తప్పా మరేమీ లేదనే కేంద్రానికి రైల్వే ఆదాయం తెచ్చిపెడుతున్న రికార్డులు చెబుతున్నమాట.
అత్యంత పెద్ద ఆదాయ వనరు జోన్ నుంచి విడిపోతే ఇలా ఎందుకు జరిగిందనే విషయాన్ని ఇప్పటి వరకూ డివిజన్ పరిధిలో ఉన్న 9 మంది కూటమి ఎంపీల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. ఆది నుంచి వాల్తేరు రైల్వే డివిజన్ పైనా.. ఆంధ్రప్రదేశ్ ర్వైల్వేల పైనా ఒడిస్సా రాజకీయ నేతలు కేంద్రంలో చక్రం తిప్పుతూ వస్తున్నారు. ఇపుడు కొత్త జోన్ ఏర్పాటులో కూడా సరిగ్గా గురి చూసి దెబ్బ కొట్టడంతో దెబ్బకి ప్రధాన ఆదాయ వనసరు రాయగడ తరలిపోయింది. ఇంత జరుగుతున్నా విశాఖకు జోన్ వచ్చిందనే ఆనందం తప్పా జోన్ కి గుండెకాయలాంటి కెకె లైన్ పోయిందనే బాధ మాత్రం కూటమి ఎంపీల్లో కనిపించకపోవడం విశేషం. కేంద్రంపై కూటమి ఎంపీలు సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఒత్తిడి తెస్తే కెకెలైన్ విశాఖ రైల్వే డివిజన్ కు ఉంచేయడం కేంద్రానికి పెద్ద పనేమీ కాదు. కానీ ఎందుకనో ఆ ప్రయత్నం దిశగా ఎవరూ ఒక్క అడుగు కూడా వేయడం లేదు.
పర్యాటకం పరంగా ఆంధ్రప్రదేశ్ లోని అరకుకు ఎంతో ప్రాధాన్యత వుంది. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు నిత్యం వస్తూనే వుంటారు. ఈ విషయాన్ని గుర్తించి ఒడిస్సా ప్రజాప్రతినిధులు దినిని గతంలోనే రాయగడ డివిజన్ కలిపేయాలని పట్టుబడితే హరిబాబు ఎంపీగా ఉన్నసమయంలో గట్టిగా పట్టుబట్టి మరీ దానిని నిలుపుదల చేయించారు. కానీ ఇపుడు కూటమి ఎంపీలు.. అందునా, విశాఖ ఎంపీ శ్రీభరత్, రైల్వే స్టాండింగ్ బోర్డ్ చైర్మన్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ లు సైతం ఈ విషయం ఒక్క మాట కూడా కేంద్రాన్ని అడగకపోవడం, ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విశాఖ రైల్వే జోన్ లో కెకె లైన్ ను కేవలం మన ఎంపీల అసమర్ధత వలనే కోల్పోవాల్సి వచ్చిందని.. తద్వారా ఉత్తరాంధ్రకి తీవ్ర అన్యాయం జరుగుతుందని వక్తలు ఆవేదన చెందుతున్నారు.
అయితే విశాఖకు రైల్వే జోన్ మేమే తెచ్చాం అంటూ కూటమి ప్రభుత్వం ప్రచారాలు చేసుకుంటున్నా.. గుండెకాయలాంటి కెకె లైన్ ని ఒడిస్సా కొట్టేస్తే చూస్తూ ఊరుకున్నారని.. అది నిజంగా విశాఖ రైల్వేజోన్ కి ద్రోహమేనని ఉత్తరాంధ్రవాసులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక మహిళా ఎంపీ గుమ్మతనూజా రాణి చేసిన విధంగా 8మంది కూటమి ఎంపీలు చేయలేకపోయారనే అపవాదుని మూటకట్టుకుంటున్నారు. పేరుకి వచ్చే జోన్ కంటే.. పేరుతోపాటు కాసులు తెచ్చే కెకెలైన్ తో కూడి విశాఖ జోన్ తీసుకువస్తే.. కూటమి ఎంపీలకి, ప్రభుత్వానికి మరింత గౌరవం పెరిగి ఉండేదని విశ్లేషకులు బావిస్తున్నారు. చూద్దాం ఇప్పటికైనా వాల్తేరు డివిజన్ లో ఉండే తొమ్మిది మంది ఎంపీలు ఏ మేరకు కోల్పోయిన కెకె లైను విషయంలో ఏ మాత్రం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తారనేది..?!