రూ.1,082.464 కోట్లు చెల్లించాం..


Ens Balu
1
New Delhi
2020-10-05 19:55:12

దేశవ్యాప్తంగా 2020-21 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో వరి ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని కేంద్రం ప్రకటించింది. ఈనెల 3వ తేదీ నాటికి మొత్తం 5,73,339 మె.ట. సేకరణ పూర్తయిందన్న కేంద్రం... 41,084 మంది రైతుల నుంచి ఈ ధాన్యం సేకరించి, కనీస మద్దతు ధరగా రూ.1,082.464 కోట్లు చెల్లించామని పేర్కొంది.. 2020-21 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో, ఈ నెల 1వ తేదీ నుంచి గింజ పత్తి (కపస్‌) సేకరణ కూడా ప్రారంభమైందిని పేర్కొంది. ఈనెల 3వ తేదీ వరకు, 29 మంది రైతుల నుంచి 147 బేళ్ల పత్తిని 'కాటన్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా' సేకరించింది. కనీస మద్దతు ధరగా రూ.40.8 లక్షలు చెల్లించినట్టు పేర్కొంది. అన్ని ప్రాంతాల నుంచి కాటన్ ను పూర్తిస్థాయిలో సేకరిస్తామని సిసిఓ వివరించింది.  లాక్ డౌన్ 5.0 నిబంధనలు అనుసరించే ఈ సేకరణలు చేపడుతున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ పేర్కొంది...