బొగ్గు రంగంలో పరిశోధనలకు మరింత ఊతం..
Ens Balu
1
New Delhi
2020-10-10 12:57:17
బొగ్గు రంగంలో జ్ఞానం, పరిశోధనలు వ్యాప్తి చేసి ప్రోత్సహించడానికి వెబ్ సైట్ సహాయం చేస్తుంద అని బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి అనిల్ జైన్ పేర్కొన్నారు. బొగ్గు రంగంలో ఆర్ & డి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఈ రోజు వెబ్ సైట్‌ను ప్రారంభించిన జైన్ మాట్లాడుతూ, ఈ వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయడంలో సి.ఎం.పి.డి.ఐ. చేసిన ప్రయత్నాలను అభినందించారు. బొగ్గు రంగంలో ఆర్ & డి కోసం వివిధ ప్రతిష్టాత్మక సంస్థలు చేసిన ప్రయత్నాల వెబ్ లింక్ లను కూడా ఈ వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆయన సూచించారు. మంత్రిత్వ శాఖ యొక్క పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ & డి) కార్యకలాపాలను ప్రోత్సహించడానికీ, బొగ్గు రంగంలో ఆర్ & డి ప్రయత్నాల కోసం పరిశోధనా సంస్థలను ఆకర్షించడానికీ, బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ వెబ్ సైట్ ను ప్రారంభించింది. మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ సైంటిఫిక్ రీసెర్చ్ కమిటీ 56 వ సమావేశంలో అనిల్ జైన్ ఈ వెబ్ సైట్ (https://scienceandtech.cmpdi.co.in/) ను ప్రారంభించారు. కోల్ ఇండియా కు చెందిన ఆర్ & డి సంస్థ, సెంట్రల్ మైన్స్ ప్లానింగ్ & డిజైన్ ఇన్ స్టిట్యూట్ లిమిటెడ్ (సి.ఎం.పి.డి.ఐ) ఈ వెబ్ సైట్ ను రూపొందించి, అభివృద్ధి చేసింది.
ఉత్పత్తి, ఉత్పాదకత, భద్రత, బొగ్గు లబ్ధి, వినియోగం, పర్యావరణం, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన బొగ్గు సాంకేతిక పరిజ్ఞానం మరియు అనుబంధ రంగాలు మొదలైన వాటి మెరుగుదల కోసం బొగ్గు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం (ఎస్ & టి) ప్రణాళిక ద్వారా బొగ్గు మరియు లిగ్నైట్ రంగాలలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది. ఈ విషయాలపై పరిశోధనలు నిర్వహించడానికి, బొగ్గు మంత్రిత్వ శాఖ నిధులను కూడా అందిస్తుండటం విశేషం.